కృతి శెట్టికి బంప‌ర్ ఆఫ‌ర్‌..ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్‌?!

April 16, 2021 at 7:52 am

కృతి శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన `ఉప్పెన‌` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన కృతి.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది. ఈ సినిమా విడుదల తర్వాత కృతి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది.

ఈ క్ర‌మంలోనే వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న `శ్యామ్ సింగ‌రాయ్‌`, సుధీర్ బాబు స‌ర‌స‌న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మ‌రియు రామ్ స‌ర‌స‌న ఓ చిత్రంలో కృతి నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీని మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, డైరెక్ట‌ర్ బాలాజీ మోహన్ కాంబోలో త్వ‌ర‌లోనే ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఈ చిత్రంలో కృతి శెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశార‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని తెలుస్తోంది. కాగా, కోలీవుడ్‌లో కృతికి ఇదే మొద‌టి సినిమా. ధనుష్ లాంటి స్టార్ హీరోతో కృతి కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌డం నిజంగా విశేష‌మే.

కృతి శెట్టికి బంప‌ర్ ఆఫ‌ర్‌..ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts