మ‌‌ళ్లీ చిరు కోసం అలాంటి క‌థే రెడీ చేస్తున్న బాబీ..వ‌ర్కోట్ అయ్యేనా?

April 16, 2021 at 7:28 am

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాక‌ముందే.. మ‌రిన్ని ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టారు చిరు. అందులో యంగ్‌ డైరెక్టర్‌ బాబి దర్శకత్వంలో తెర‌కెక్క‌బోయే చిత్రం కూడా ఒక‌టి.

వీరి కాంబో తెర‌కెక్క‌బోయే చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, రవి శంకర్ నిర్మించ‌నున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌తంలో వి.వి వినాయక్-చిరు కాంబినేషన్‌లో వచ్చిన ఠాగూర్ చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అయితే ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి క‌థ‌నే చిరు కోసం బాబీ రెడీ చేస్తున్నాడ‌ట‌. అలాంటి బ్యాక్‌డ్రాప్‌లోనే సమాజంలోని సమస్యలను ఎత్తిచూపేలా బాబీ తెరకెక్కించే సినిమా ఉంటుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లెందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్రయూనిట్.

మ‌‌ళ్లీ చిరు కోసం అలాంటి క‌థే రెడీ చేస్తున్న బాబీ..వ‌ర్కోట్ అయ్యేనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts