జగపతి బాబు అలియాస్ జగ్గుభాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపడి బాబు.. సరైన సక్సెస్ లేక కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే బాలయ్య హీరోగా తెరకెక్కిన `లెజెండ్` సినిమాలో విలన్ పాత్ర పోషించి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ఈయన సూపర్ సక్సెస్ అయ్యాడు.
ఇక అప్పటి నుంచి విలన్ పాత్రలో తనదైన మార్క్‌ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తేలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
అయితే ఈ సినిమా కోసం జగపతి బాబు ఒక కొత్త మేకేవర్‌తో సిద్దమవుతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అంతేకాదు, అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో తాను పోషించిన `బసి రెడ్డి` లుక్‌ను బీట్ చేస్తానంటూ కామెంట్ కూడా పెట్టాడు జగ్గుభాయ్.
https://www.instagram.com/p/CODhRx1HP2I/?utm_source=ig_web_copy_link