బసి రెడ్డిని బీట్ చేస్తానంటున్న జగ్గుభాయ్!

జగపతి బాబు అలియాస్ జగ్గుభాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జ‌గ‌ప‌డి బాబు.. స‌రైన స‌క్సెస్ లేక కొంత కాలం సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అయితే బాలయ్య హీరోగా తెర‌కెక్కిన `లెజెండ్` సినిమాలో విలన్ పాత్ర పోషించి సెకండ్ ఇన్నింగ్స్‏ను ప్రారంభించి ఈయ‌న సూపర్ సక్సెస్ అయ్యాడు.

ఇక అప్ప‌టి నుంచి విలన్ పాత్రలో తనదైన మార్క్‏ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తేలో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

అయితే ఈ సినిమా కోసం జ‌గ‌ప‌తి బాబు ఒక కొత్త మేకేవర్‌తో సిద్దమవుతున్నాడు. ఈ విషయాన్ని ఆయ‌నే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అంతేకాదు, అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో తాను పోషించిన `బ‌సి రెడ్డి` లుక్‌ను బీట్ చేస్తానంటూ కామెంట్ కూడా పెట్టాడు జగ్గుభాయ్.

https://www.instagram.com/p/CODhRx1HP2I/?utm_source=ig_web_copy_link