నంద్యాల MLA భూమా నాగిరెడ్డి అకాల మరణం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరిని కలచివేసింది మాట వాస్తవం.ఇలాంటి టైం లో తల్లి దండ్రుల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో మునిపోయిన భూమా పిల్లలకి ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలి.విచిత్రం ఏంటంటే బాసటగా నిలవడం లోను రాజకీయమే..చివరికి సంతాపము రాజకీయమే…ఆఖరికి భూమా మరణమే ఒక శవ రాజకీయమైపోయింది. ఇక్కడ భూమా మరణం వెనుక అధికార టీడీపీ పాత్ర మరీ ముక్యంగా అధ్యక్షుడు చంద్రబాబు పాత్ర ఎంత అనే చర్చ జరుగుతున్న […]
Tag: ysrcp
భూమా మృతికి సంతాపమా? ఎన్నికల ప్రచారమా?
కాదేదీ కవితకనర్హం అన్నాడో మహాకవి!! ఇప్పుడు కాదేదీ రాజకీయాలకనర్హం అంటున్నారు రాజకీయ నాయకులు! ఏ అంశాన్నయినా రాజకీయాన్ని చేసి.. దానిని తమ అవసరాలకు ఉపయోగించుకోవడం ప్రస్తుత రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య! కరెక్టుగా ఇప్పుడు భూమా నాగిరెడ్డి మరణాన్ని కూడా ఎవరికి వారు.. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. చివరికి ఆయనకు సంతాప సభ కూడా రాజకీయాలకు వేదికగా మారిపోవడం దురదృష్టకరం!! ఒక నాయకుడు మృతి చెందిన వెంటనే ఆ నాయకుడికి, ఆ నాయకుడి […]
నెల్లూరు ఎమ్మెల్సీ పోరులో ఆధిపత్య పోరు
ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీకి చుక్కెదురయ్యేలా కనిపిస్తోంది. మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను.. రెండింటిలో సునాయాసంగా గెలుస్తామని నేతలు ధీమాగా ఉన్నారు. ఇక మూడో స్థానంలో మాత్రం ప్రతిపక్షానికి దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం! ముఖ్యంగా తమ అభ్యర్థుల విజయం కోసం మంత్రి నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర రెడ్డి వర్గం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదే సమయంలో తమ […]
వైసీపీ టార్గెట్‌గా చంద్రబాబు వ్యూహం… ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి !
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు అధికార టీడీపీ ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షం వైసీపీ నేతల ఎత్తులను అంతేస్థాయిలో చిత్తు చేసేలా వ్యూహం రచిస్తోంది. సుమారు రెండున్నరేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఉద్దానం కిడ్నీ మరణాలు, పశ్చిమగోదావరిలో ఆక్వాపార్కు తదితర ప్రధాన సమస్యలపై చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు జగన్ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహం సిద్ధం చేసింది. దీనికితోడు రోజా విషయం […]
ఆయన జగన్ టచ్ లో ఉన్నారని తెలిసి తెగ ఫీలైపోతున్నా మంత్రి
ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణకు..ప్రతిపక్ష నేత జగన్ భయం పట్టుకుంది. సొంత నియోజకవర్గమైన శ్రీకాళహస్తిలో.. టీడీపీ క్యాడర్ అంతా వైసీపీలోకి వెళ్లిపోతుందనే ప్రచారం బొజ్జలను టెన్షన్ పెడుతోంది. మరో పక్క తనకు అత్యంత సన్నిహిత వ్యక్తులే.. జగన్‌లో టచ్‌లో ఉన్నారన్న విషయం తెలిసిన దగ్గర నుంచి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారట. తనపై క్యాడర్, నాయకులు అసంతృప్తిగా ఉన్నారన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నానని.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారట. అసలే మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక టెన్షన్ […]
యూపీలో బీజేపీ విజయం – జగన్‌కు కొత్త టెన్షన్
ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ ఓటమి.. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది! ప్రధాని మోడీ విజయం ఎలా ఉన్నా.. కాంగ్రెస్-ఎస్పీ కూటమి పరాభవం జగన్‌కు కంటి నిండా కునుకు లేకుండా చేస్తోంది. ఇలా అయితే ఏపీలో తన పరిస్థితి ఏంటా అనే గుబులు మొదలైందట. అక్కడి ఫలితాలకీ.. జగన్‌కీ ఉన్న లింక్ ఏంటనేగా మీ సందేహం? ఆ లింక్ పేరే ప్రశాంత్ కిషోర్!! బిహార్ ఎన్నికల్లో నితీష్‌కుమార్‌కు వ్యూహకర్తగా నిలిచిన ప్రశాంత్‌ను.. ఏరికోరి జగన్ […]
సమయం లేదు మిత్రమా … కడపలో ఇక రణమే
స్థానిక మండలి ఎన్నికలు దగ్గరపడుతున్న దృష్ట్యా పార్టీ గెలుపుకి అవసరమైన ఓటర్లని ఒక చోటకి చేర్చండి ,నాయకులంతా అప్రమత్తం అవండి అని పార్టీ నాయకులకి ,పార్టీ శ్రేణుకులకు టీడీపీ అధ్యక్షులు మరియు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు .దీనితో పార్టీ నియోజవర్గ ఇంచార్జిలు మరియు నాయకులూ ఓటర్లను శిబిరాలకు తరలిస్తూ ఉండటంతోపాటు ,మిగిలి ఉన్నవారిని కూడా తరలిస్తున్నారు .దీంతో శిబిర రాజకీయాల సందడి మరింత పెరిగింది. పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఇరు పార్టీలు ఎవరి వ్యూహ […]
చంద్రబాబు సేఫ్ గేమ్‌లో విన్నర్ వైసీపీనా?
మొత్తానికి టీడీపీపై వైసీపీ ఆధిపత్యం సంపాదించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడో స్థానం ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠకు తెరదించింది. ఏడు స్థానాల్లో ఐదింటిని టీడీపీ గెలుచుకున్నా.. మిగిలిన రెండు స్థానాలను దక్కించుకుంది. దీంతో తమకు బలం లేకపోయినా రెండో సీటును గెలుచుకుని.. టీడీపీపై పైచేయి సాధించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు!! అయితే ఇందులో టీడీపీ అధిక స్థానాలు గెలుచుకున్నా.. నైతికంగా టీడీపీపై వైసీపీ విజయం సాధించినట్టయింది. ఎమ్మెల్యేల […]
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి ఏమైంది..!
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజా ఎప్పుడూ హైలైట్‌గా నిలుస్తారు!! గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమె చేసిన గలాటా ఎవరూ మరిచిపోయి ఉండరు! కానీ కొత్త అసెంబ్లీలో ఆమె మరింత కొత్తగా వ్యవహరిస్తున్నారు. అసలు మాట్లాడటమే మానేశారు! ఎదురుదాడికి దిగడంలేదు! పక్క నుంచి సెటైర్లు వేయడం లేదు! రకరకాల హావభావాలు ఆమె మోములో కనిపించడం లేదు! తొలిరోజు అసెంబ్లీలో రోజా వెనక సీట్లో కూర్చోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎందుకీ వింత ప్రవర్తన.. అంటే దీని వెనుక […]
