ఆనందం ఇంతలోనే ఆవిరైపోయింది. గెలిచామన్న సంతోషం రాత్రి గడవగానే ఎగిరిపోయింది. నిన్న ఉల్లాసంగా కనిపించిన నేతలే.. నేడు నిరుత్సాహంతో కుంగిపోతున్నారు. ఏపీలో అధికార పక్షానికి ఊహించని షాక్ ఎదురైంది. కడప, నెల్లూరు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకుని ఊపు మీదున్న టీడీపీకి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షం బలంగా ఉన్న జిల్లాల్లో గెలిచామని సంబరాలు చేసుకున్న సీఎం చంద్రబాబు ఆనందాన్ని.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆవిరి చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పట్టభద్రుల […]
Tag: ysrcp
వైసీపీలోకి మంచు ఫ్యామిలీ ఎంట్రీ..!ఆ రెండు నియోజకవర్గాలపై కన్ను..!
టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి సపరేట్ క్రేజ్ ఉంది. విలక్షణ నటుడు మోహన్‌బాబు రూటే ఓ సపరేటుగా ఉంటుంది. మోహన్‌బాబుకు ఇటు సినిమా రంగంతో పాటు అటు రాజకీయ రంగంతోను ఎంతో అనుబంధం ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీతో పాటు విపక్ష వైసీపీతోను ఆయనకు చాలా దగ్గరి రిలేషన్ ఉంది. ఏపీ ప్రస్తుతం సీఎం చంద్రబాబు మోహన్‌బాబుకు వరుసకు మేనత్త కొడుకు అవుతాడు. ఇక విపక్ష వైసీపీ అధినేత జగన్ అయితే అల్లుడు వరుస అవుతాడు. గతంలో […]
కడప ఎమ్మెల్సీలో … `అంతులేని కథ’
కడప గడపలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. ఎలాగైనా సొంత జిల్లాలోనే ప్రతిపక్ష నాయకుడిని దెబ్బకొట్టాలని కలలు కంటున్న సీఎం చంద్రబాబు కల నెరవేరింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఇంత వరకూ బాగానే ఉంది.. కానీ దీని వెనుక అంతులేని కథ ఉంది. ప్రలోభాల పర్వం నడిచింది. అధికార పార్టీ తన మంత్ర దండాన్ని తీసింది. ప్రతిపక్షానికి సంపూర్ణ మెజారిటీ ఉన్న జిల్లాలో.. అధికార పార్టీ విజయం సాధించడమంటే.. దీని వెనుక అధికార పార్టీ `ధనప్రవాహం` […]
టీడీపీ 3 – వైసీపీ 0…. ఓటమి జగన్‌కు రాజకీయంగా పెద్ద దెబ్బే
ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ తన దూకుడు చూపించింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప, కర్నూలుతో పాటు నెల్లూరు ఎమ్మెల్సీలను టీడీపీ కైవసం చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన కౌంటింగ్‌లో ముందుగా నెల్లూరుతో టీడీపీ బోనీ కొట్టింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిపై 87 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ అభ్యర్థి […]
నంద్యాలలో చంద్రబాబు మైండ్ బ్లాక్ చేసిన జగన్
ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెందడంతో అక్కడ ఐదారు నెలల్లో ఉప ఎన్నిక జరగనుంది. నంద్యాల ఉప ఎన్నిక ప్రస్తావన అప్పుడే ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు వస్తోంది. దీనిపై విపక్ష వైసీపీ అధినేత జగన్ ముందుగానే డెసిషన్ తీసేసుకున్నారు. నంద్యాల సీటు తమదే అని…అక్కడ నుంచి వైసీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ప్రకటించడంతో నంద్యాలలో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే చంద్రబాబు ఇక్కడి నుంచి […]
2019 వార్: ఏపీ-తెలంగాణలో రాజకీయాలను శాసిస్తున్న కులాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడి అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మధ్యలో జరిగే చిన్నా చితకా ఎలక్షన్లతో పాటు 2019 ఎన్నికలపైనే ఉంది. 2019లో ఏపీ, తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది ? ఏ పార్టీల మధ్య ప్రధానంగా పోరు ఉంటుంది ? అసలు ఎవరి బలం ఎంత? ఎవరి బలగం ఎంత? ఒంటరిగా బరిలో నిలిచి ఒకే పార్టీ అధికారం దక్కించుకునే అవకాశం ఉందా ? ఇలా ఎన్నో ప్రశ్నలు […]
ఏపీలో ఆ 3 ఎమ్మెల్సీలు టీడీపీకా …వైసీపీకా..!
ఏపీలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన మూడు జిల్లాల్లో శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. స్థానిక సంస్థల కోటాలో మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 6 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక వైసీపీకి మంచి బలం ఉన్న జగన్ సొంత జిల్లా కడపతో పాటు కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కడప జిల్లాలో జగన్ తన సొంత బాబాయ్ […]
టీడీపీ మూడో విడత ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్..వైసీపీలో 3 వికెట్లు డౌన్..!
ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇటీవలే కాస్త బ్రేక్ పడింది. రెండు విడతలుగా జరిగిన ఈ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు 21 మంది విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు ఎమ్మెల్సీలు, ఒకరిద్దరు ఎంపీలు కూడా అధికార టీడీపీ గూటికి చేరిపోయారు. ఆపరేషన్ ఆకర్ష్ రెండో పేజ్ తర్వాత కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడు టీడీపీ మూడో విడత ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపినట్టు తెలుస్తోంది. మూడో విడత స్టార్టింగ్‌లోనే విపక్ష వైసీపీకి చెందిన ఇద్దరు […]
కర్నూలులో టీడీపీకి ఊహించని షాక్
కర్నూలు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి! ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతోంది. అలాగే ప్రతిపక్ష వైసీపీలోకి చేరబోయే నాయకుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. ఇక రేపో మాపో వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ప్రభుత్వంపై తీవ్రంగా అసంతృప్తితో ఉన్న ఆయన.. ఈ మేరకు ప్రతిపక్ష నేత జగన్‌తో చర్చించారని సమాచారం. ఆయనకు ఎంపీ టికెట్ […]
