బ‌న్నీతో న‌టించే ఛాన్స్‌..ప‌రువుపోతుంద‌ని నో చెప్పిన డైరెక్టర్‌ బాబీ!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా న‌టించే ఛాన్స్ వ‌స్తే.. దాదాపు ఎవ్వ‌రూ వ‌దులుకోరు. కానీ.. ద‌ర్శ‌కుడు కే ఎస్‌.ర‌వీంద్ర అదేనండీ మ‌న బాబీ మాత్రం ప‌రువు పోతుంద‌ని వ‌చ్చిన అవ‌కాశానికి నో చెప్పాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్న బాబీతో ప్ర‌ముఖ రైట‌ర్ చిన్ని కృష్ణకు ప‌రిచయం ఉంది. ఆ ప‌రిచ‌యంతోనే చిన్ని కృష్ణ.. బాబీని రాఘవేంద్ర‌రావు ద‌గ్గ‌ర‌కి తీసుకువెళ్లి ఏదైనా వేషం ఇవ్వాల‌ని కోరార‌ట‌. దాంతో […]

హాస్ప‌ట‌ల్‌లో న‌య‌న్ తండ్రి..పెళ్లికి ఒప్పుకున్న బ్యూటీ?!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార తండ్రి కురియన్ కొడియట్టు తీవ్ర అస్వస్థతకు గురై కొచ్చిన్‌లోని ఓ ప్రైవేటు హాస్ప‌ట‌ల్‌లో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. నయనతార తండ్రి కురియన్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త్వ‌ర‌గా ప్రియుడు, కోలీవుడు ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌ శివన్‌ను పెళ్లి చేసుకోవాల‌ని న‌య‌న్‌ను కోరుతున్నార‌ట‌. కానీ, ఆమె చేతి నిండా సినిమాలు ఉండ‌డంతో పెళ్లిని ఆల‌స్యం చేస్తూ వ‌చ్చింది. అయితే ఇప్పుడు […]

ప్రియుడితో కిచెన్‌లో శ్రుతి కుస్తీలు..వీడియో వైర‌ల్‌!

లాంగ్ గ్యాప్ త‌ర్వాత క్రాక్, వ‌కీల్ సాబ్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి సూప‌ర్ హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న శ్రుతి హాస‌న్.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ సినిమా చేస్తూ మంచి జోరు మీద ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ప్రియుడు శంతను హజరికాతో కిచెన్‌లో శ్రుతి కుస్తీలు ప‌డింది. అలా అని వంట చేసిందని అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే, […]

బండ్ల గ‌ణేష్‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ వార్నింగ్‌..ఏం జ‌రిగిందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడున‌ని చెప్పుకునే బండ్ల గ‌ణేష్‌కు.. ఆయ‌న ఫ్యాన్సే వార్నింగ్ ఇవ్వ‌డం ఏంట‌న్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోవాల్సిందే. బండ్ల నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో తీన్ మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. వీటితో తీన్ మార్ ఫ్లాప్ అవ్వ‌గా.. గ‌బ్బ‌ర్ సింగ్ సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్‌తో మ‌రో సినిమాను చేయ‌బోతున్న‌ట్టు బండ్ల గ‌ణేష్ […]

రౌడీ హీరోపై క‌న్నేసిన‌ `ఉప్పెన‌` డైరెక్ట‌ర్‌..గుడ్‌న్యూస్ చెబుతాడా?

సుకుమార్ ప్రియ‌శిష్యుడు బుచ్చిబాబు సాన‌ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి హీరో,హీరోయిన్‌గా ఉప్పెన చిత్రాన్ని తెర‌కెక్కించిన బుచ్చిబాబు.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు. దాంతో ఈయ‌న పేరు ఇండ‌స్ట్రీలో మారుమోగిపోయింది. ఈ నేప‌థ్యంలోనే బుచ్చిబాబు నెక్స్ట్ ఏ హీరోతో చేయ‌బోతున్నాడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ, ఎవ‌రితోనూ ఫైన‌ల్ కాలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ […]

ఓటీటీలో `రిపబ్లిక్`..క్లారిటీ ఇచ్చేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తాజా చిత్రం రిప‌బ్లిక్‌. దేవా కట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ, జగపతి బాబు త‌దిత‌రులు కీల‌క పాత్రలు పోసించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే రిప‌బ్లిక్ ఓటీటీలో విడుద‌ల అవుతుంద‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. భారీ ఓటీటీ ఆఫ‌ర్లు రావ‌డంతో […]

ఫ్లాప్‌ ఇచ్చిన డైరెక్ట‌ర్‌కి బాల‌య్య గ్రీన్‌సిగ్నెల్‌..త్వ‌ర‌లోనే..?

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. వీరి కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. బాల‌య్య మ‌రో డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. గతంలో బాలయ్యతో డిక్టేటర్ వంటి ఫ్లాప్ చిత్రాన్ని […]

బీచ్‌లో మ‌స్తు ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్‌..ఫొటోలు వైర‌ల్‌!

నాని హీరోగా తెర‌కెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్‌.. మొద‌టి సీనిమాతోనే అందం, అభిన‌యం, తన‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. ఇక ఈ చిత్రం త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ.. మెహ్రీన్‌ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ ర‌ద్దు చేసుకుని వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన మెహ్రీన్‌.. […]

`నార‌ప్ప‌` ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది..!

వెంక‌టేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. త‌మిళంలో హిట్ అయిన అసుర‌న్‌కు ఇది రీమేక్‌. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించింది. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే జులై11న మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా.. కొద్ది సేప‌టి క్రిత‌మే ఈ […]