`నార‌ప్ప‌` ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది..!

వెంక‌టేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. త‌మిళంలో హిట్ అయిన అసుర‌న్‌కు ఇది రీమేక్‌. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించింది.

ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే జులై11న మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా.. కొద్ది సేప‌టి క్రిత‌మే ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ `చలాకీ చిన్నమ్మి`ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

`చిలిపి చూపుల చలాకీ చిన్నమ్మీ..ఎలాగే నిన్నిడిచి ఎలాగే ఉండేది`..అంటూ సాగే ఈ సాంగ్ అద్భుతంగా అక‌ట్టుకుంటోంది. అలాగే ఈ సాంగ్ ను యంగ్ ప్లేబ్యాక్ సింగర్స్ నూతన మోహన్, ఆదిత్య అయ్యంగార్ ఆల‌పించ‌గా.. గీత రచయిత అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం, మణిశర్మ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచాయి. మ‌రి మీరూ లేట్ చేయ‌కుండా ఆ సాంగ్‌ను ఓ సారి వినేయండి.