నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్.. మొదటి సీనిమాతోనే అందం, అభినయం, తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ.. మెహ్రీన్ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.
ఇదిలా ఉంటే.. ఈ మధ్య హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన మెహ్రీన్.. తాజాగా బీచ్‌లో మస్తు ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లి ఆగిపోయిందనే బెంగే లేకుండా.. పొట్టి డ్రెస్ వేసుకొని, నడుము అందాలు చూపిస్తూ ఫుల్ జోష్‌లో మెహ్రీన్ ఈ ఫొటోల్లో కనిపిస్తుండడంతో..నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మెహ్రీన్ ప్రస్తుతం ఎఫ్3తో పాటుగా మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్‌కు జోడీగా ఓ చిత్రంలో నటిస్తోంది.