బండ్ల గ‌ణేష్‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ వార్నింగ్‌..ఏం జ‌రిగిందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడున‌ని చెప్పుకునే బండ్ల గ‌ణేష్‌కు.. ఆయ‌న ఫ్యాన్సే వార్నింగ్ ఇవ్వ‌డం ఏంట‌న్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోవాల్సిందే. బండ్ల నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో తీన్ మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే.

వీటితో తీన్ మార్ ఫ్లాప్ అవ్వ‌గా.. గ‌బ్బ‌ర్ సింగ్ సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్‌తో మ‌రో సినిమాను చేయ‌బోతున్న‌ట్టు బండ్ల గ‌ణేష్ ప్ర‌క‌టించాడు. ఈ సినిమా పూర్తి వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ అభిమాని.. బండ్ల గ‌ణేష్‌ను బెదిరించాడు. కాటమరాయుడు సినిమాలో బండ్ల గణేష్‌ను పవన్ కళ్యాణ్ కత్తి పెట్టి నరికేస్తా అని బెదిరించినట్టుగా ఉండే స్టిల్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ.. పవన్‌తో బ్లాక్‌బస్టర్‌ సినిమా తీయకపోతే ఇలాగే ఉంటుంది బండ్ల‌న్న అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఇది గ‌మ‌నించిన బండ్ల ఓకే అంటూ రిప్లై ఇచ్చాడు. దాంతో ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

https://twitter.com/ganeshbandla/status/1414166856160608257?s=20