బ‌న్నీతో న‌టించే ఛాన్స్‌..ప‌రువుపోతుంద‌ని నో చెప్పిన డైరెక్టర్‌ బాబీ!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా న‌టించే ఛాన్స్ వ‌స్తే.. దాదాపు ఎవ్వ‌రూ వ‌దులుకోరు. కానీ.. ద‌ర్శ‌కుడు కే ఎస్‌.ర‌వీంద్ర అదేనండీ మ‌న బాబీ మాత్రం ప‌రువు పోతుంద‌ని వ‌చ్చిన అవ‌కాశానికి నో చెప్పాడ‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్న బాబీతో ప్ర‌ముఖ రైట‌ర్ చిన్ని కృష్ణకు ప‌రిచయం ఉంది.

ఆ ప‌రిచ‌యంతోనే చిన్ని కృష్ణ.. బాబీని రాఘవేంద్ర‌రావు ద‌గ్గ‌ర‌కి తీసుకువెళ్లి ఏదైనా వేషం ఇవ్వాల‌ని కోరార‌ట‌. దాంతో రాఘ‌వేంద్ర‌రావు వెంటనే గంగోత్రి చిత్రంలో బ‌న్నీ ఫ్రెండ్ పాత్ర‌కు బాబీని తీసుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే బాబీ నిక్కర్ వేసుకోవాలని అందుకోసం కొలతలు ఇవ్వమని చెప్పారట. నిక్కర్ వేసుకుంటే గుంటూరులో తన పరువు పోతుందని భావించిన బాబీ.. వెంటనే ఆ ఆఫర్ వద్దని అన్నాడట.

మరి ఏమి చేస్తావ్ అని అడ‌గగా… కథలు రాస్తానని చెప్పాడట. గంగోత్రి మూవీ కోసం కొన్ని సన్నివేశాలు రాయమనగా.. బేబీ అద్భుతమైన సన్నివేశాలు రాసి ఇచ్చాడ‌ట. మొత్తానికి బ‌న్నీ ప‌క్క‌న న‌టించే ఛాన్స్ ను వ‌దులుకుని.. రైటైర్‌గా, డైరెక్ట‌ర్‌గా ఎదిగాడు బాబీ. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవ కుశ, వెంకీమామ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన బాబీ.. త్వ‌ర‌లోనే మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయ‌నున్నాడు.