జ‌క్క‌న్న‌తో చిల్ అవుతున్న చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్‌..వీడియో వైర‌ల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఆర్ఆర్ఆర్‌ ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ జాయిన్ అయ్యారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. […]

ప్ర‌భాస్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే?!

రెబ‌ల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన‌ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ పూర్తి చేసిన ప్ర‌భాస్‌.. మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ మ‌రియు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్ కె చిత్రాలు చేస్తున్నారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ప్ర‌భాస్ కు భారీగా ఆస్తులు ఉన్నాయ‌ట‌. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణరాజు గారు […]

ప‌వ‌న్‌కు క‌లిసిరానిది..చిరుకు క‌లిసొస్తుందా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత `వ‌కీల్ సాబ్‌` మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్‌కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. వేణు శ్రీ‌రామ్ ఈ రీమేక్ కు ద‌ర్వ‌క‌త్వం వ‌హించ‌గా.. దిల్ రాజు నిర్మించారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ప‌వ‌న్‌-శ్రుతి హాస‌న్ ల ఎపిసోడ్ మాత్రం ప్రేక్ష‌కుల‌కు మెప్పించ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంది. […]

ఆక‌ట్టుకుంటున్న ఆది `బ్లాక్` టీజ‌ర్‌!

నటుడు సాయికుమారు తనయుడు, యంగ్ హీరో ఆది సాయి కుమార్ తాజా చిత్రం `బ్లాక్‌`. జి.బి కృష్ణ దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మహంకాళి మూవీస్‌ బ్యానర్‌పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‏ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ఆదికి జోడీగా దర్శనా బానిక్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కనిపించని సస్పెన్స్ విలన్ కి హీరోకి నడిచే ఎంగేజింగ్ డ్రామాలా బ్లాక్ […]

ఈసారి మ‌హేష్ బ‌ర్త్‌డే వేడుక‌లు ఎక్క‌డ జ‌ర‌గ‌బోతున్నాయో తెలుసా?

ఆగస్ట్ 9న టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. ప్రతి ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానాలు, పాలాభిషేకాలు, పెద్ద పెద్ద కటౌట్ లనూ ఏర్పాటు చేసి కేకులను కట్ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం మ‌హేష్.. అభిమానులకు తన పుట్టినరోజున మొక్కలను నాటాలని అభ్యర్థించాడు. దాంతో అభిమానులు మొక్క‌లు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సారి […]

వెనకంజలో ఎన్టీఆర్ ..ఫ్యాన్స్ లో అసహనం !

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఒక‌టి, రెండు పాట‌లు మిన‌హా.. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. అయితే ఈ పాన్ ఇండియా మూవీ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర‌ణ్ మాత్ర‌మే ఎక్కువ‌గా […]

భ‌ర్త కోసం కాజ‌ల్ కీల‌క నిర్ణ‌యం..మ‌ళ్లీ అలా..?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి కొత్తగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో స్థిర‌ప‌డిన వ్యాపార‌వేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది కాజ‌ల్‌. పెళ్లి త‌ర్వాత పెద్దగా పర్సనల్‌ లైఫ్‌కు టైమ్‌ కేటాయించకుండానే ఆచార్య సెట్స్‌లో జాయిన్ అయిపోయింది. ఆ తర్వాత భర్త […]

డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు దిల్ రాజు వార్నింగ్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు దిల్ రాజు వార్నింగ్ ఇవ్వడం ఏంటీ..? అస‌లు ఈయ‌న ఏ విష‌యంలో ఆయ‌న‌కు వార్నింగ్ ఇచ్చాడు..? అన్న సందేహాలు మీకు వ‌చ్చే ఉంటాయి. అది తెలియాలంటే అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. శంక‌ర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో త్వ‌ర‌లోనే ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ న‌టిస్తోంది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు […]

నాని బాట‌లోనే న‌డ‌వ‌బోతున్న‌ ప్ర‌ముఖ హీరోలు..?!

క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఈ మ‌ధ్యే థియేట‌ర్లు ఓపెన్ అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ సినిమాలు విడుదల చేసేందుకు తెలుగు హీరోలు, నిర్మాతలు వెన‌క‌డుగు వేస్తున్నారు. ప్ర‌భుత్వాలు విధించిన సవాలక్ష నిబంధన‌ల మ‌ధ్య సినిమా విడుద‌లైనా.. ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. థియేట‌ర్‌లో తమ సినిమా చూపించాలని హీరోల‌కు, దర్శకనిర్మాతలకు ఉన్నా.. పరిస్థితులు ఏ రకంగానూ అనుకూలించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ప‌లు చిత్రాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి. నాని హీరోగా నటించిన ‘టక్‌ జగదీష్‌’ కూడా […]