నాని బాట‌లోనే న‌డ‌వ‌బోతున్న‌ ప్ర‌ముఖ హీరోలు..?!

క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఈ మ‌ధ్యే థియేట‌ర్లు ఓపెన్ అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ సినిమాలు విడుదల చేసేందుకు తెలుగు హీరోలు, నిర్మాతలు వెన‌క‌డుగు వేస్తున్నారు. ప్ర‌భుత్వాలు విధించిన సవాలక్ష నిబంధన‌ల మ‌ధ్య సినిమా విడుద‌లైనా.. ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. థియేట‌ర్‌లో తమ సినిమా చూపించాలని హీరోల‌కు, దర్శకనిర్మాతలకు ఉన్నా.. పరిస్థితులు ఏ రకంగానూ అనుకూలించ‌డం లేదు.

Tuck Jagadish Movie Now Release On Amazon prime

ఈ నేప‌థ్యంలోనే ప‌లు చిత్రాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి. నాని హీరోగా నటించిన ‘టక్‌ జగదీష్‌’ కూడా ఓటీటీలోనే విడుదల కానుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి నాని ట‌క్ జ‌గ‌దీష్‌ను ఎలాగైనా థియేటర్లలోనే విడుదల చేయాలని భావించాడు. కానీ, ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఓటీటీ డీల్ కూడా పూర్తి అయింద‌ని స‌మాచారం.

Love Story Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos  | eTimes

ఇక నిజంగానే అమెజాన్‌లో ట‌క్ జ‌గ‌దీష్ విడుద‌లైతే.. ఆ త‌ర్వాత‌ మరికొన్ని సినిమాలు కూడా విడుదల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నాగ చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన ల‌వ్‌స్టోరీ, రానా ద‌గ్గుబాటి విరాట‌ప‌ర్వం చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని.. రిలీజ్ కోసం ఎప్ప‌టి నుంచో ఈగ‌ర్ వెయిట్ చేస్తున్నాయి. అందుక‌నే నాని బాట‌లో ఈ ఇద్ద‌రు హీరోలు కూడా న‌డ‌వ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Rana Daggubati and Sai Pallavi share poster of Virata Parvam, set for a  summer release