ప్ర‌భాస్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే?!

August 7, 2021 at 12:43 pm

రెబ‌ల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన‌ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ పూర్తి చేసిన ప్ర‌భాస్‌.. మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ మ‌రియు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్ కె చిత్రాలు చేస్తున్నారు.

ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ప్ర‌భాస్ కు భారీగా ఆస్తులు ఉన్నాయ‌ట‌. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణరాజు గారు అప్ప‌టి రోజుల్లోనే చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో స్థలాలను కొనుగోలు చేసారట. హైదరాబాద్ సమీపంలో కూడా స్థలాలు ఉన్నాయట.

అంతేకాదు, ప్ర‌భాస్‌కు హైదరాబాద్ లో రెండు ఇళ్లు, ఖ‌రీదైన కార్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, ఫామ్‌హౌస్‌లు, గ్రానైట్ భూమి, కొబ్బరి తోటలు వంటివి చాలానే ఉన్నాయ‌ట‌. వీట‌న్నిటి విలువ దాదాపు రూ. 7 వేల కోట్లకు పైగానే ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ప్ర‌భాస్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts