మీసం మెలేసి సవాలు విసురుతున్న ఎన్టీఆర్‌..ఎందుకోస‌మంటే?

August 7, 2021 at 12:57 pm

అవును, ఎన్టీఆర్ మీసం మెలేసి స‌వాల్ విసురుతున్నారు. ఆయ‌న స‌లాల్ ఎందుకోస‌మో తెలియాలంటే ఆల‌స్యం చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న ఎన్టీఆర్.. ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీ ప్ర‌సారం కాబోయే ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ షో ఆగ‌స్టులో ప్రారంభం కానుంద‌ని తెలియ‌జేస్తూ.. తాజాగా ఓ ప్రోమోను విడుద‌ల చేశారు.

Evaru Meelo Koteeswarulu - Coming in August _ NTR - YouTube

ఈ ప్రోమోలో.. స్కూలు టీచర్‌ పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు? అని పిల్లలను ప్ర‌శ్నించ‌గా.. ఒక‌రు కలెక్టర్ అని, ఒక‌రు పైలెట్‌ అని, మరొకరు సీఎం అని సమాధానం చెప్తుండగా ఒక విద్యార్థిని మాత్రం అమ్మను అవుతాన‌ని చెప్పి అందరికి షాక్ ఇస్తుంది. అయితే పెద్దయ్యాక అదే అమ్మాయికి ఎన్టీఆర్ షోలో ఆడే అవ‌కాశం వ‌స్తుంది. అప్పుడు ఎన్టీఆర్‌.. జీవితంలో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా ఆమె మరోసారి అమ్మనవుదాం అనుకుంటున్నాను అని అంటుంది.

Evaru Meelo Koteeswarulu Registration 2021 and Launch Date

ఆమె స‌మాధానికి ఆశ్చ‌ర్య‌పోయిన ఎన్టీఆర్ అమ్మ‌న‌వ్వ‌డం ఏంటీ..? అని అడ‌గ‌గా.. రేపటితరాన్ని ముందుకు నడపాలంటే అది అమ్మ వల్లే సాధ్యం అంటూ తన తల్లి పడ్డ కష్టాలను వివరించింది. ఇక ఆమె మాట‌ల‌కు క‌రిగిపోయిన ఎన్టీఆర్‌..ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెల్చుకోవచ్చు. కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది.. రండి గెలుద్దాం అంటూ మీసం మెలేసి త‌న‌దైన శైలిలో సవాలు విసురుతాడు. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ ప్రోమో షోపై మ‌రిన్ని అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

 

మీసం మెలేసి సవాలు విసురుతున్న ఎన్టీఆర్‌..ఎందుకోస‌మంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts