రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా.. ఏ పార్టీ అయినా.. తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను వెతుకుతుంది. ఉదాహరణకు పరీక్షకు హాజరైన విద్యార్థి ముందు ఎన్నో ప్రశ్నలు వుంటాయి. ఏది రాయాలనేది విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే విధంగా రాజకీయాల్లో కూడా. అనేక మార్గాలు ఉంటాయి. ఏది అవసరం ఉంటే దానిని తీసుకుంటారు. ఇప్పుడు వైసీపీ విషయానికి వచ్చినా అంతే. తనకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుని మరోసారి […]
Tag: Telugu desam party
బాబు ఢిల్లీలో ఇంత లైట్ అయిపోయాడా…!
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు నాయకు లు కలిసి విష్ చేశారు. అంతేకాదు, వారితో చంద్రబాబు కూడా ఖుషీ ఖుషీగా మాట్లాడారు. ఓడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తోను, తమిళనాడు సీఎం కేసీఆర్‌తోనూ.. చంద్రబాబు మాటా మాటా కలిపారు. అయితే.. ఎటొచ్చీ.. గతంలో తనతో కలిసి చెట్టాపట్టాలేసుకు తిరిగిన వారు మాత్రం చంద్రబాబును పక్కన పెట్టారు. దీంతో ఈ పరిణామం చర్చకు దారితీసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలో […]
గల్లా పొలిటికల్ గేమ్ చంద్రబాబుపై నమ్మకం లేకేనా…!
టీడీపీ ఎంపీ, దూకుడు నాయకుడిగా పేరు తెచ్చుకున్న గల్లా జయదేవ్ తాజాగా తన కు చెందిన అమర రాజా బ్యాటరీ కంపెనీని తెలంగాణకు తరలించేశారని, దీనివల్ల ఏపీకి తీవ్ర నష్టం వచ్చేసిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ అసమర్థత, వేధింపులు.. టార్గెట్ కారణంగానే గల్లా కంపెనీ వెళ్లిపోయిందని అనేక రూపాల్లో దీనిపై దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నంలో 9500 కోట్ల మేరకు తెలంగాణకు పెట్టుబడులు సమకూరుతున్నాయని కూడా చెబుతున్నారు. ఇది నిజమే. వచ్చే 2030 […]
టీడీపీలో ఆ ఇద్దరు మారరు… చంద్రబాబే మారాలట…!
కొన్ని కొన్ని విషయాలు.. కొందరు నేతల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మారాలనే టాక్ వినిపి స్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ విషయంలో చంద్రబాబు మారాలని ఇక్కడి నాయకులు తెగేసి చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో తాడిపత్రి కౌన్సిల్ సభ్యుల మీటింగ్ జరిగింది. వీరంతా కూడా టీడీపీ తరఫున విజయందక్కించుకున్నారు. అయితే, ఈ సమావేశానికి కౌన్సిల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఇదే విషయంపై చంద్రబాబు ప్రశ్నించారు. అయితే, నాయకులు […]
చంద్రబాబుకు లాస్ట్ ఛాన్స్ డైలాగ్ ఇచ్చింది ఎవరు… ఇదో గందరగోళం…!
రాబిన్ శర్మ.. టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా తొలిసారి తెరమీదకు వచ్చారు. ఇప్పటి వరకు కొద్ది మంది నా యకులకు మాత్రమే ఆయన తెలుసు. మహానాడులోనూ ఆయన కనిపించలేదు. కానీ, ఆయన వ్యూహాలు మాత్రం చేస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే, రాష్ట్ర నేతల విస్తృత సమావేశంలో తొలిసారి.. ఆయన కనిపించారు. ఆయన మాట కూడా వినిపించింది. ఈ క్రమంలోనే ఆయన ప్రతిపాదించిన కీలక కార్యక్రమం `ఇదేం ఖర్మ`పై వివరణ ఇచ్చారు. ఏం చేయాలో కూడా చెప్పారు. అయితే, ఈ […]
చంద్రబాబు ఆ నిజం తెలుసుకునేందుకే అక్కడకు వెళ్లారా..!
“తత్వం బోధపడుతోంది. పరిస్థితి ఏమాత్రం మునుపటిలాగా లేదు. అంతకన్నా ముదిరిపోయింది. ఊహిం చని విధంగా వ్యతిరేకత వస్తోంది. ఈ పరిణామాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపించకపోవు. అందుకే అంద రూ కలసి పనిచేయండి!“ ఇదీ.. అంతర్గత సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులకు తేల్చి చెప్పిన సంగతి! అయితే.. అందరూ కూడా.. ఆయన ముందు తలలాడించారు. పార్టీని గాడిలో పెడతామన్నారు. కానీ, ఆయన చంద్రబాబు అలా కర్నూలు నుంచి అడుగు బయట పెట్టారో […]
టీడీపీకి ఇంత పెద్ద కర్మ ఏంటో…!
“ఆడుకోవాలే కానీ.. రాజకీయాలను మించిన వస్తువు ఏముంటుంది!“ అంటారు మహా రచయిత ఆరుద్ర. ఆయన ఉద్దేశంలో కవితలు, కథలు కావొచ్చు. కానీ, నిజ జీవితంలోకి వస్తే.. ఆడుకునేందుకు రాజకీయాలు కీలక అస్త్రాలే కానున్నాయి. ఇప్పటికే ఏపీ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ లు.. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. వచ్చే ఒక్క సారి గెలిచేందుకు.. అధికార పార్టీ రెడీ అయిపోయింది. సో.. ఎన్నికలు హాట్‌గా కూడా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు […]
వైసీపీకి షాక్ ఇచ్చేలా గేమ్ ఆడిన బాబు…!
టీడీపీ అధినేత చంద్రబాబు వంటి వ్యూహాత్మక నాయకుడు ఉండరని అంటారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడిగా ఆయనకు పేరుంది. ఇప్పుడు కూడా.. అదే తరహాలో చంద్రబాబు వ్యవహ రించారు. గత కొన్ని రోజులుగా.. ఒక కీలక విషయంపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి.. పేరు మార్చారు. ఈ సమయంలో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆయనపేరు మార్చేందుకు వీల్లేదని కూడా స్పష్టం చేసింది. అయితే.. దీనిపై వైసీపీ చిత్రంగా స్పందించింది. […]
బాబు మొహమాటంతో పోయే సీట్లు ఇవే..!
వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలుపుగుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తానని.. టీడీపీ అధినేత చంద్రబా బు పదే పదే చెబుతున్నారు. ప్రజల్లో ఉండేవారికి.. ప్రజలతో జై కొట్టించుకునే వారికి మాత్రమే టికెట్లు దక్కుతాయని అంటున్నారు. ముఖ్యంగా యువతకు టికెట్లు ఎక్కువగా ఇస్తామని చెబుతున్నారు. అయి తే.. ఆచరణలోకి వచ్చే సరికిమాత్రం ఇది సాధ్యమేనా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఎన్నికలకు ఇంకా చాలానే సమయం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చుట్టూ చేరిన కొందరు సీనియర్లు ఆయనను […]








