బాబు ఢిల్లీలో ఇంత లైట్ అయిపోయాడా…!

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఢిల్లీలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను ప‌లువురు నాయ‌కు లు క‌లిసి విష్ చేశారు. అంతేకాదు, వారితో చంద్ర‌బాబు కూడా ఖుషీ ఖుషీగా మాట్లాడారు. ఓడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌తోను, త‌మిళ‌నాడు సీఎం కేసీఆర్‌తోనూ.. చంద్ర‌బాబు మాటా మాటా క‌లిపారు. అయితే.. ఎటొచ్చీ.. గ‌తంలో త‌న‌తో క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకు తిరిగిన వారు మాత్రం చంద్ర‌బాబును ప‌క్క‌న పెట్టారు.

దీంతో ఈ ప‌రిణామం చ‌ర్చ‌కు దారితీసింది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి కేంద్రంలో పాగావేయాల‌ని భావిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీలు.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయం చేయాల‌ని చూస్తున్నారు. అయితే.. వీరికి గ‌తంలో ఆత్మీయ స్నేహితుడిగా ఉన్న చంద్ర‌బాబు ఢిల్లీ వ‌స్తే.. వారు క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం.. టీడీపీ నేత‌ల‌ను విస్మ‌యానికి గురి చేసింది.

What Did Narendra Modi Say To Chandrababu Naidu?

జీ20 స‌ద‌స్సు నేప‌థ్యంలో అఖిల ప‌క్ష నేత‌ల‌తో ప్ర‌ధాని మోడీ సమావేశం నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో ఢల్లీకి వెళ్లిన చంద్ర‌బాబు.. ప‌నిలో ప‌నిగా.. ఇత‌ర రాష్ట్రాల కీల‌క నాయ‌కులు, సీఎంల‌తో వ‌రుసగా వెళ్లి క‌లిశారు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను క‌లుసుకుందామ‌ని భావించ‌గా ఆయ‌న మొహం తిప్పేసు కున్నారు. పోనీ.. మ‌మ‌త‌ను క‌లుద్దామ‌ని ప్ర‌య‌త్నించినా.. చిరున‌వ్వుతో ఆమె స‌రిపెట్టారు.

CSO injured in attack on TDP chief Chandrababu Naidu during road show at  Nandigama

వాస్త‌వానికి వీరిద్ద‌రూ కూడా చంద్ర‌బాబుకు కావాల్సిన నాయ‌కులు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వారి రాష్ట్రాల్లో కేంద్రం పెత్త‌నం చేసిన స‌మ‌యంలో చంద్ర‌బాబు వారికి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఏపీలో చంద్ర‌బాబుకు కేజ్రీవాల్ ప్ర‌చారం కూడా చేసిపెట్టారు. అయితే… ఇప్పుడు మాత్రం చంద్ర‌బాబును వారు ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి రీజ‌నేంటి? చంద్ర‌బాబు మోడీ విష‌యంలో సానుకూలంగా ఉండ‌డం.. కుదిరితే బీజేపీతో పొత్తుకురెడీ కావ‌డ‌మేనా? అనేది చర్చ‌నీయాంశంగా మారింది.