టీడీపీకి ఇంత పెద్ద క‌ర్మ ఏంటో…!

“ఆడుకోవాలే కానీ.. రాజకీయాలను మించిన వ‌స్తువు ఏముంటుంది!“ అంటారు మ‌హా ర‌చ‌యిత ఆరుద్ర‌. ఆయ‌న ఉద్దేశంలో క‌వితలు, క‌థ‌లు కావొచ్చు. కానీ, నిజ జీవితంలోకి వ‌స్తే.. ఆడుకునేందుకు రాజ‌కీయాలు కీల‌క అస్త్రాలే కానున్నాయి. ఇప్ప‌టికే ఏపీ రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ లు.. ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్నాయి. వ‌చ్చే ఒక్క సారి గెలిచేందుకు.. అధికార పార్టీ రెడీ అయిపోయింది. సో.. ఎన్నిక‌లు హాట్‌గా కూడా ఉండ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే `రాష్ట్రానికి ఇదేం ఖ‌ర్మ‌` అనే కార్య‌క్ర‌మాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రారంభిచ‌నున్నారు. మంచిదే.. దీనిని అందిపుచ్చుకుని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి, వారి స‌మ‌స్య‌లు ప‌ట్టించుకుని భ‌రోసా ఇవ్వాల‌నేది ఈ కార్య‌క్ర‌మం ప్ర‌ధాన వ్యూహం. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా చేసింది ఇదే క‌దా..! అని కొంద‌రు త‌మ్ముళ్లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఎందుకంటే.. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ వేడి.. సోష‌ల్ మీడియా దూకుడు నేప‌థ్యంలో కొన్ని కార్య‌క్ర‌మాలు బూమ‌రాంగ్ అవుతున్నాయ‌నేది సీనియ‌ర్ల మాట‌. అందుకే, ప‌థ‌కాలు కానీ, కార్య‌క్ర‌మాలు కానీ ఆచి తూచి నిర్ణ‌యించాల‌ని సూచ‌న చేస్తున్నారు. తాజాగా రూపొందించిన రాష్ట్రానికి ఇదేం ఖ‌ర్మ‌.. కార్య‌క్ర‌మం ఏమేర కు స‌త్ఫ‌లితాన్ని ఇస్తుంద‌నేది చూడాలి.అయితే, ఈ కార్య‌క్ర‌మం కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండి.. వారి స‌మ‌స్య‌లు తీర్చేది కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కేవ‌లం..రాష్ట్రానికి ఇదేం ఖ‌ర్మ‌..! అనేది వైసీపీప్ర‌భుత్వ లోటుపాట్లు.. అవినీతి, అక్ర‌మాలు, దందాల‌ను ప్ర‌జ‌ల ముందుకు తీసుకువ‌చ్చేందుకే తాము ఈ కార్య‌క్ర‌మం రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్టు మాజీ సీఎం చంద్ర‌బా బు పేర్కొన్నారు. అయితే.. ఇది పార్టీకి ఎంత వ‌ర‌కు బూస్ట్ ఇస్తుంద‌నేది మాత్రం ఎవ‌రూ చెప్ప‌డం లేదు. అందుకే.. ఈ కార్య‌క్ర‌మం విజ‌యవంతం చేసే బాధ్య‌త‌ను చంద్ర‌బాబు స్వీక‌రించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది స‌క్సెస్ అయితే ఓకే. కానీ, ఏమాత్రంతేడా వ‌చ్చినా.. `రాష్ట్రానికి ఇదేం ఖ‌ర్మ‌` టీడీపీకి రివ‌ర్స్ అవుతుంద‌ని అంటున్నారు.