చంద్ర‌బాబు ఆ నిజం తెలుసుకునేందుకే అక్క‌డ‌కు వెళ్లారా..!

“త‌త్వం బోధ‌ప‌డుతోంది. ప‌రిస్థితి ఏమాత్రం మునుప‌టిలాగా లేదు. అంత‌క‌న్నా ముదిరిపోయింది. ఊహిం చని విధంగా వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఈ ప‌రిణామాలు పార్టీపై తీవ్ర ప్ర‌భావం చూపించ‌క‌పోవు. అందుకే అంద రూ క‌ల‌సి ప‌నిచేయండి!“ ఇదీ.. అంత‌ర్గ‌త స‌మావేశంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ నాయ‌కుల‌కు తేల్చి చెప్పిన సంగ‌తి! అయితే.. అంద‌రూ కూడా.. ఆయ‌న ముందు త‌ల‌లాడించారు.

Chandrababu Naidu to tour Kurnool, Nandyal districts today

పార్టీని గాడిలో పెడ‌తామ‌న్నారు. కానీ, ఆయ‌న చంద్ర‌బాబు అలా క‌ర్నూలు నుంచి అడుగు బ‌య‌ట పెట్టారో లేదో.. త‌మ్ముళ్లు త‌లోదారి ప‌ట్టారు. అంతేకాదు.. ఎవ‌రికి వారు అంతా మ‌రిచిపోయారు. ఇదీ.. తాజాగా చంద్ర బాబు ప‌ర్య‌టించిన ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న టీడీపీ నేత‌ల ప‌రిస్థితి. నిజానికి చంద్ర‌బాబు కూడా ఈ ద‌ఫా జిల్లాలో పార్టీ ప‌రిస్థితిని స‌రిదిద్ది.. నాయకుల‌ను లైన్‌లో పెట్టేందుకు అయితే రాలేదు.

CBN in Kurnool District - Forum

ఈ విష‌యం అంద‌రికీ తెలుసు. చంద్ర‌బాబు కూడా త‌న ప‌ర్య‌ట‌న‌ను.. ఒక ప్ర‌యోగం.. మాదిరిగానే చూసు కున్నారు. ఎందుకంటే.. ఒక‌ప్ప‌టి కంచుకోట క‌ర్నూలులో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంది ? ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎలా చూస్తున్నారు ? అనేది ఇటీవ‌ల కాలంలో ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. వైసీపీ ప్ర‌భుత్వం.. క‌ర్నూ లును న్యాయ రాజ‌ధాని చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం.. ఇటీవ‌ల భారీగా అభివృద్ధి ప‌నులు జ‌రుగుతుండ‌డం వంటివి టీడీపీని క‌ల‌వ‌ర‌పరుస్తున్నాయి.

chandrababu, కర్నూలులో CBN క్రేజ్.. మీరు మళ్లీ మళ్లీ రావాలి బాబు.. అంటూ  నినాదాలు..! - tdp chief chandrababu visit kurnool - Samayam Telugu

ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ టీడీపీ ప‌రిస్థితిని అంచ‌నా వేసేందుకే చంద్ర‌బాబు ఇక్క‌డ ప‌ర్య‌టించార‌నే వాద‌నుంది. అందుకే ఎక్క‌డా కూడా.. చంద్ర‌బాబు పెద్ద‌గా త‌మ్ముళ్ల‌తో క‌లిసి.. వారికి దిశానిర్దేశం చేసేం దుకు క్లాస్ తీసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. కేవ‌లం త‌న ఇమేజ్ ఎలా ఉంది.. ? పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది ? అని తెలుసుకునేందుకు మాత్రమే వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఏదేమైనా.. త‌త్వం బోధ‌ప‌డింది! ఇక‌, ఏం చేస్తారో చూడాలి.