చంద్ర‌బాబుకు లాస్ట్ ఛాన్స్ డైలాగ్ ఇచ్చింది ఎవ‌రు… ఇదో గంద‌ర‌గోళం…!

రాబిన్ శ‌ర్మ‌.. టీడీపీ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా తొలిసారి తెర‌మీద‌కు వ‌చ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొద్ది మంది నా యకుల‌కు మాత్ర‌మే ఆయ‌న తెలుసు. మ‌హానాడులోనూ ఆయ‌న క‌నిపించ‌లేదు. కానీ, ఆయ‌న వ్యూహాలు మాత్రం చేస్తున్నార‌నే ప్ర‌చారం ఉంది. అయితే, రాష్ట్ర నేత‌ల విస్తృత స‌మావేశంలో తొలిసారి.. ఆయ‌న క‌నిపించారు. ఆయ‌న మాట కూడా వినిపించింది.

Read all Latest Updates on and about robin sarma

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌తిపాదించిన కీల‌క కార్య‌క్ర‌మం `ఇదేం ఖ‌ర్మ‌`పై వివ‌ర‌ణ ఇచ్చారు. ఏం చేయాలో కూడా చెప్పారు. అయితే, ఈ ప్ర‌తిపాద‌న‌పై పార్టీలోనే మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. ఎందుకంటే.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఇంత‌క‌న్నా మంచి నినాదాలు.. పేర్లు.. ల‌భించ‌లేదా ? అనే ప్ర‌శ్న తెర‌మీదికి రాక‌పోవ డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేసింది. ఇప్ప‌టికే పీక‌ల్లోతు క‌ష్టాల్లో పార్టీ ఉంది.

జగన్ స్ట్రాటజీకి రాబిన్ కౌంటర్ స్ట్రాటజీ..! - Telugu Journalist

ఈ నేప‌థ్యంలో పార్టీని కాపాడుకునేందుకు.. వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, ఇదేం ఖ‌ర్మ అనే నినాద‌మే స‌రిగాలేద‌ని.. పార్టీ అభిమానులు, ఎన్నారైలు కూడా ఈ మెయిళ్లు, వాట్సాప్ సందేశాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే పేరు ప్ర‌క‌టించినా మార్పు కావాల‌ని, ఇంటింటికీ టీడీపీ అని కానీ, బాబు ప్ర‌భుత్వం-జ‌గ‌న్ ప్ర‌భుత్వం తేడా ఇదే అని కానీ,పేరు పెట్టాల‌ని సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

వ్యూహ‌క‌ర్త‌గా ఇప్ప‌టి వ‌ర‌కు రాబిన్ ఒంట‌రిగా సాధించిన విజ‌యం అంటూ ఏదీ లేదు. పైగా ఇటీవ‌ల చంద్ర‌బాబు చేసిన `లాస్ట్ ఛాన్స్‌` డైలాగును కూడా రాబిన్ ఇచ్చార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇది పార్టీని అతి పెద్ద‌డ్యామేజీ చేసింద‌ని అంటున్నారు. ఏదేమైనా రాబిన్ వ్యూహంపై మాత్రం త‌మ్ముళ్లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు.