చంద్ర‌బాబుపై ఆ ఇద్ద‌రు మంత్రుల గుర్రు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం త‌యార‌వుతోందా? త‌న మంత్రుల‌కే త‌న‌కు విమ‌ర్శ‌కులుగా మారుతున్నారా? ఒక‌రిద్ద‌రు మంత్రులు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారా? అంటే ఇప్పుడు ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. రెండు రోజుల కింద‌ట జ‌రిగిన ఓ స‌మావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి మా బాస్ అనుమ‌తించ‌డం లేదంటూ నేరుగా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు బాణాలు ఎక్కుపెట్ట‌డం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. వాస్త‌వానికి ప్ర‌భుత్వానికి ఆదాయం ఇచ్చే వాటిలో ఎక్సైజ్ […]

మాన‌వ‌త్వం చాటిన కేంద్ర మంత్రి

చిన్న చిన్న త్యాగాలు ఒక్కోసారి పెద్ద పెద్ద స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంతోపాటు.. అంత‌క‌న్నా పెద్ద పేరును కూడా తెస్తాయి. ఇప్ప‌డు అలాంటి అతి చిన్న త్యాగంతో అతి పెద్ద పేరు సంపాదిస్తున్నారు కేంద్ర మంత్రి జ‌యంత్ సిన్హా. ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా మ‌నం చేయ‌గ‌లిగినంత సేవ చేయాల‌ని ప‌దేప‌దే చెబుతున్న ప్ర‌ధాని మోడీ మాట‌లు మంత్రి సిన్హా చెవికెక్కించుకున్నారో ఏమో.. ఓ ప్ర‌త్యేక సాయం చేసి.. స‌ర్వ‌త్రా అభినంద‌న‌లు అందుకుంటున్నారు. మ‌రి అదేంటో చూద్దాం.. శ్రేయ అనే యువ‌తి […]

తెలంగాణ మంత్రుల‌కు ఏమైంది..?

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కుటుంబ రాజ‌కీయాలు రాజ్య‌మేలుతున్నాయ‌న్న‌విప‌క్షాల మాట‌లు కాసేపు ప‌క్క‌న‌బెడితే..  అస‌లు కేసీఆర్ కు దీటుగా నిలిచి నెగ్గుకు రాగ‌ల నేత మ‌రొక‌రు టీఆర్ఎస్‌లో మాత్ర‌మే కాదు.. తెలంగాణ‌కు సంబంధించినంత‌వ‌ర‌కు మ‌రే పార్టీలోను క‌నిపించ‌డం లేద‌న్న‌ది నిష్టుర నిజం. దీంతో ఆ పార్టీ హ‌వాకు అక్క‌డ ఎదురే లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్‌ ప్ర‌భుత్వంలో కేసీఆర్ కుటుంబ స‌భ్యులు కాకుండా  మిగిలిన మంత్రులంతా డ‌మ్మీలు అయిపోయారంటూ విప‌క్షాలు చేస్తున్నవిమ‌ర్శ‌ల అంశాన్ని జ‌నం కూడా పెద్ద‌గా […]

మంత్రుల‌ను ఉతికి ఆరేసిన కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ రెచ్చిపోయారు. ఆగ్ర‌హంతో ఊగిపోయారు. త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల‌పై నిప్పులు క‌క్కారు. ప్ర‌తిప‌క్షంపై ఎందుకు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఒక ప‌క్క  విప‌క్షా లు అన్నీ క‌లిసి ప్ర‌భుత్వంపై దుమ్మెత్తి పోస్తుంటే మీకు క‌నిపించ‌డంలేదా? అంత పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తుంటే మీకు వినిపించ‌డం లేదా? అంటూ ఉతికి ఆరేశారు. కేసీఆర్ ఉగ్రానికి మంత్రులంద‌రూ షాక్ అయిపోయార‌ట‌. శుక్ర‌వారం జ‌రిగిన ఈ ప‌రిణామం తెలంగాణ అధికార పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీసింది. […]

పెళ్లాం చేతిలో కీలుబొమ్మ‌గా మారిన ఏపీ మంత్రి

తాను ఎంత‌గా శ్ర‌మించినా…, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల్లోనూ.. త‌ల‌కు మించిన స్థాయిలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నా… ప్ర‌జ‌ల్లో మాత్రం త‌న ప్ర‌భుత్వానికి ఆశించిన స్థాయిలో మైలేజీ రావ‌డం లేద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తెగ ఇదైపోతున్నార‌ట‌.. ఈ ప‌రిస్థితికి అస‌లు కార‌ణ‌మేంటో తేల్చుకునేందుకు ప‌నిలో ప‌నిగా త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌ పనితీరుపై రహస్యంగా విచారణ కూడా జరిపించిన  ముఖ్య‌మంత్రికి అందులో వెల్ల‌డైన స‌మాచారం చూసి దిమ్మ‌తిరిగిపోయిన‌ట్టు స‌మాచారం. రాజ‌ధాని రాక‌తో అనూహ్యంగా ప్రాధాన్యం […]

ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు డీ గ్రేడ్ ఇచ్చిన బాబు

ఏపీ ప్ర‌భుత్వంలో మంత్రులు ఇప్పుడు విచిత్ర ప‌రిస్తితిలో కొట్టుమిట్టాడుతున్నారు. త‌మ‌కు తిరుగులేదు.. అని గుండెల నిండా గాలి పీల్చుకుని తిరిగిన నేత‌లు ఇప్పుడు ఒక్క‌సారిగా కుంగిపోతున్నారు. దీనంత‌టికీ కార‌ణం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సీఎం చంద్ర‌బాబు చేయించిన స‌ర్వేనే! ఆ స‌ర్వేలే ఇప్పుడు మంత్రులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. స‌ర్వేలో భాగంగా మంత్రుల ప‌నితీరు, ప్ర‌జ‌లు, అధికారుల‌తో ఇంట‌రాక్ష‌న్‌, స‌మీక్ష‌లు వంటి వివిధ ప‌నుల ఆధారంగా చంద్ర‌బాబు వారికి గ్రేడ్‌లు నిర్ణ‌యించారు. అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు […]

ఆ ఏపీ మంత్రికి నాలుగు డీ గ్రేడ్లు

చంద్ర‌బాబు కేబినెట్‌లో కీల‌క శాఖ‌లు చూస్తున్న ఓ మ‌హిళా మంత్రి ఫ్యూచ‌ర్ క్లోజ్ అయిన‌ట్టేనా? ప‌ద‌విని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించిన ఫ‌లితంగా స‌ద‌రు నేత ఇక‌ ఇంటి ముఖం ప‌ట్టాల్సిందేనా?  మ‌రికొద్ది రోజుల్లో జ‌రుగుతుంద‌ని భావిస్తున్న ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ‌లో ఆ మ‌హిళా మంత్రిగారు త‌న సీటును ఖాళీ చేయాల్సిందేనా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు విజ‌య‌వాడ‌లోని కేఎల్ యూనివ‌ర్సిటీలో మూడు రోజుల‌పాటు శిక్ష‌ణ […]

ఏపీ టీడీపీ నేత‌ల పూజ‌లు ఎందుకో..!

ఇప్పుడు ఏపీలో ఏ ప్ర‌ముఖ దేవాల‌యంలో చూసినా.. చంద్ర‌బాబు కేబినెట్‌లోని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలే క‌నిపిస్తున్నారు! ఇది జోక్ కాదు నిజ‌మే! అయితే, వారు దేవుడి మీద భ‌క్తి ఉండి వెళ్తున్నారా?  లేక వాళ్ల మ‌న‌సులో ఉన్న కోరిక తీర్చ‌మ‌ని అడిగేందుకు వెళ్తున్నారా?  లేక త‌మకున్న ప‌ద‌వీ గండం త‌ప్పించ‌మ‌ని కోరేందుకు వెళ్తున్నారా? అంటే మాత్రం ఒక్కొక్క‌ళ్ల‌ది ఒక్కో కోరిక అని చెప్ప‌క త‌ప్ప‌దు. సీఎం చంద్ర‌బాబు త‌న మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రిస్తాన‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించారు. అయితే, […]

మంత్రి వర్గ విస్తరణ – చినబాబు ఒక్కడేనా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనల్లో ఉన్నారని కొన్ని నెలలుగా ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం అంటే తేనెతుట్టెను కదిలించినట్లే అవుతుందని చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకనే విస్తరణ కాకుండా ఒక్కర్ని ప్రస్తుతానికి కొత్తగా మంత్రివర్గంలో తీసుకుని, విస్తరణను వాయిదా వేయాలని చూస్తున్నారట. ఆ ఒక్కరూ ఎవరో కాదట, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ అట. చినబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా డిమాండ్లు వినవస్తున్న వేళ, తన కుమారుడ్ని […]