క‌రోనా వ‌చ్చి పోతే.. తెలుసుకోవ‌డం ఎలా?

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను అల్ల‌క‌ల్లోం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్‌లో వ‌చ్చిన క‌రోనాతో పోల్చుకుంటే సెకెండ్ వేవ్ క‌రోనా మ‌రింత వేగంగా, తీవ్రంగా విజృంభిస్తోంది. దీంతో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ సంఖ్య‌లో న‌మోదు అయ్యాయి. అయితే చాలా మందికి క‌రోనా వ‌చ్చి పోతుంది. ఇలాంటి వారు ఎంద‌రో ఉన్నారు. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా ఉండటం వ‌ల్ల వైర‌స్ దాడి చేసినా అది బ‌ల‌హీన ప‌డిపోతుంది. అందుకే చాలా మందికి తెలియకుండానే వైరస్‌ […]

త్వరలోనే స్టార్ట్ కానున్న‌ బిగ్‌బాస్-5.. లీకైన కంటెస్టెంట్ల లిస్ట్‌?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకెండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే.. ఐదో సీజ‌న్ కూడా ఎప్పుడో ప్రారంభం అయ్యి ఉండేది. అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. త్వ‌ర‌లోనే బిగ్ బాస్ ఐదో సీజన్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ సారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక కూడా గత సీజన్ మాదిరే […]

తెలంగాణ‌లో క్షీణిస్తున్న క‌రోనా జోరు.. తాజా కేసులెన్నంటే?

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. మ‌ళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డింది. దీంతో ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. ఇక తెలంగాణ‌లోనూ విశ్వ‌రూపం చూపించిన క‌రోనా .. ప్ర‌స్తుతం కంట్రోల్‌లోకి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా క్షీణిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల […]

ఏపీలో నిన్న మ‌రింత త‌గ్గిన క‌రోనా కేసులు..90 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న స్వ‌ల్పంగా త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

అన్‌లాక్‌కు సిద్దమవుతున్న తెలంగాణ స‌ర్కార్‌..ప్ర‌క‌ట‌న ఎప్పుడంటే?

స‌ద్దుమ‌ణిగింది అనుకున్న క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌తి రోజు ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. తెలంగాణ‌లోనూ సెకెండ్ వేవ్‌లో క‌రోనా విశ్వ‌రూపం చూప‌డంతో.. కేసీఆర్ స‌ర్కార్ వెంట‌నే లాక్‌డౌన్ విధించారు. ప్ర‌స్తుతం మ‌ళ్లీ రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌రియు మ‌ర‌ణాలు అదుపులోకి వ‌చ్చాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అన్‌లాక్ కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో కొన‌సాగుతున్న […]

మెగా ఆఫ‌ర్ కోసం స‌మంత డైరెక్ట‌ర్ ప్ర‌య‌త్నాలు?!

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం అక్కినేని వారి కోడ‌లు స‌మంత‌తో శాకుంతలం సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ పౌరాణిక ప్రేమ క‌థ‌లో దేవ్ మోహన్ స‌మంత‌కు జోడీగా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి క‌రోనా సెకెండ్ వేవ్ అడ్డు ప‌డింది. దాంతో షూటింగ్‌కు బ్రేక్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో […]

సోనూసూద్ ప్రధాని అవ్వాలి: బాలీవుడ్ నటి

ఆపత్కాలంలో గొప్ప పనులు చేస్తున్న సోనూసూద్ పై సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సోనూసూద్ రియల్ హీరో అంటూ పొగిడిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు, సెలబ్రెటీలు.. ఇండియాకి సోనూసూద్ ప్రధాని మంత్రి అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటీమణి హుమా ఖురేషీ కూడా సోనూసూద్ ప్రధాని కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సోనూసూద్ ఎలక్షన్లలో తప్పకుండా పోటీ […]

సుశాంత్ సింగ్ ప్రియురాలుకు బిగ్‌బాస్ ఆఫ‌ర్‌?!

బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ అనుమాన‌స్ప‌ద మృతి త‌ర్వాత ఆయ‌న ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌త్తి పేరు మారుమోగిపోయిన సంగ‌తి తెలిసిందే. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బ‌య‌ట ప‌డ‌టం, రియా అరెస్ట్ అవ్వ‌డం, ఆమె కెరీర్ నాశ‌నం అవ్వ‌డం ఇలా అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇక జైలు నుంచి బ‌య‌ట ప‌డిన రియా.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ బాలీవుడ్‌లో బిజీ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే ఇలాంటి త‌రుణంలో రియాకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే హిందీ బిగ్ […]

అత్యాచారం కేసులో ప్ర‌ముఖ న‌టుడు అరెస్ట్‌..ట్విస్ట్‌ ఏంటంటే?

ప‌లు హిందీ సీరియ‌ల్స్ ద్వారా బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్ అయిన ప్ర‌ముఖ న‌టుడు ప‌ర్ల్ వీ పూరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మైనర్‌ బాలికపై రేప్ చేసినట్టుగా ఆమె తండ్రి ఫిర్యాదు చేయ‌డంతో.. పోక్సో చట్టం కింద కేసు పెట్టి ముంబై పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. పురి తో పాటు ఇంకో ఐదుగురిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పురి అరెస్ట్ అయిన కొన్ని గంట‌ల్లోనే.. అత‌డికి బెయిన్ వ‌చ్చింద‌ని ప్ర‌చారం […]