ఓటీటీలో కీర్తి `గుడ్ లక్ సఖి`..క్లారిటీ ఇచ్చేసిన మేక‌ర్స్‌!

కిర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం గుడ్ లుక్ స‌ఖి. నగేష్ కుకునూర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఓ పల్లెటూరిలో అందరూ దురదృష్టానికి చిహ్నంగా భావించే ఓ అమ్మాయి ఎలా జాతీయస్థాయి రైఫిల్ షూటర్‌గా ఎదిగిందనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశాలు […]

కమలా హారిస్‌కు తప్పిన పెను ప్రమాదం..ఏం జ‌రిగిందంటే?

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పెను ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె తాజాగా తొలిసారి విదేశీ పర్యటకు పయనమయ్యారు. మేరీల్యాండ్ నుంచి గ్వాటెమాల‌కు ఎయిర్‌ఫోర్స్-2 విమానం బయల్దేరారు. అయితే విమానం గాల్లో ఉండగానే… సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం.. వెనక్కి తిరిగొచ్చి అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ముందుగానే లోపాన్ని గుర్తించడంతో ప్రమాదం తప్పింది. అనంత‌రం తాను క్షేమంగా ఉన్నానని కమలా హ్యారిస్ మీడియాకు […]

`అఖండ` విడుద‌ల అప్ప‌టికి షిఫ్ట్ అయింద‌ట‌?!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అఖండ‌. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా పూర్ణ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాని నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ, క‌రోనా సెకెండ్ కార‌ణంగా విడుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం […]

ప‌వ‌న్ – హ‌రీష్ సినిమాపై క్రేజీ అప్డేట్‌?!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న ఒకే చెప్పిన ద‌ర్శ‌కుల్లో హ‌రీష్ శంక‌ర్ కూడా ఒక‌రు. ఇప్ప‌టికే ప‌వ‌న్, హ‌రీష్‌ కాంబోలో వ‌చ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వీరి తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే […]

కొత్త పెళ్లికూతురు యామీ గౌతమ్‌పై కంగనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

బాలీవుడ్ భామ యామీ గౌత‌మ్ రీసెంట్‌గా డైరెక్టర్‌ ఆదిత్య ధర్‌తో మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచిన సంగ‌తి తెలిసిందే. ఇరు కుటుంబాలు మ‌రియు అత్యంత సన్నిహితుల సమక్షంలో జూన్ 4న వీరి వివాహం నిరాడంభరంగా జ‌రిగింది. ఇక ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపిన యామీ గౌత‌మ్‌.. పెళ్లి ఫొటోల‌ను కూడా షేర్‌ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్‌.. […]

భార‌త్‌లో అదుపులోకి వ‌స్తున్న క‌రోనా..తాజా కేసుల లెక్క ఇదే!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు నిన్న భారీగా త‌గ్గాయి. గత 24 గంటల్లో భారత్‌లో 1,00,636 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,09,975 కు చేరుకుంది. అలాగే […]

ఆ మూవీ నుండి సైడైన‌ ర‌వితేజ‌..లైన్‌లోకి వ‌చ్చిన మెగా హీరో?

క్రాక్ సినిమాతో మంచి ఫామ్‌లోకి వ‌చ్చాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. ప్ర‌స్తుతం ఈయ‌న‌తో సినిమాలు చేసేందుకు ప‌లువురు ద‌ర్శ‌కులు క్యూ క‌డుతున్నారు. ఆ లిస్ట్‌లో త్రినాథ‌రావు న‌క్కిన ఒక‌రు. ఇటీవ‌లె ఈయ‌న ర‌వితేజ‌కు క‌థ చెప్పి.. ఓకే చెప్పించుకున్నారు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్న‌ట్టు అధికారికంగా కూడా ప్ర‌క‌టించాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించ‌బోతున్నాయి. అయితే తాజా […]

టాలీవుడ్‌పై దృష్టి సారించిన ధునుష్‌..త్వ‌ర‌లోనే..?

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. ధ‌నుష్ సినిమాలు తెలుగులోకి డ‌బ్ అవ్వ‌డం వ‌ల్ల‌.. ఇక్క‌డ కూడా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడీయ‌న‌. ఇక కోలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్న‌ ధ‌నుష్‌.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడ‌న్న వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. మంచి క‌థ దొరికితే టాలీవుడ్ ఎంట్రీ ఇద్దామ‌ని ధ‌నుష్ ఎప్ప‌టి నుంచో భావిస్తున్నాడ‌ట‌. అయితే ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌, స్టార్ డైరెక్ట‌ర్ […]

ప్రేమ‌లో ప‌డిన ర‌ష్మిక..ఎవ‌రితో అంటే?

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. త‌క్క‌వ స‌మ‌యంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు హిందీ, కన్న‌డ‌, త‌మిళ చిత్రాల‌తో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. ర‌ష్మిక ప్రేమ‌లో ప‌డింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. ర‌ష్మిక ఎవ‌రితో ప్రేమలో ప‌డింది..? అనేగా మీ డౌట్.. అక్క‌డికే వ‌స్తున్నా. […]