సుశాంత్ సింగ్ ప్రియురాలుకు బిగ్‌బాస్ ఆఫ‌ర్‌?!

బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ అనుమాన‌స్ప‌ద మృతి త‌ర్వాత ఆయ‌న ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌త్తి పేరు మారుమోగిపోయిన సంగ‌తి తెలిసిందే. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బ‌య‌ట ప‌డ‌టం, రియా అరెస్ట్ అవ్వ‌డం, ఆమె కెరీర్ నాశ‌నం అవ్వ‌డం ఇలా అన్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

ఇక జైలు నుంచి బ‌య‌ట ప‌డిన రియా.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ బాలీవుడ్‌లో బిజీ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే ఇలాంటి త‌రుణంలో రియాకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే హిందీ బిగ్ బాస్ షోలో ఆఫ‌ర్ ద‌క్కింద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

రియా కూడా ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉందని టాక్ న‌డుస్తోంది. కాగా, త్వరలో సల్మాన్‌ఖాన్‌ హోస్ట్‌గా బిగ్‌బాస్‌ 15 ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం.