మెగా ఆఫ‌ర్ కోసం స‌మంత డైరెక్ట‌ర్ ప్ర‌య‌త్నాలు?!

June 6, 2021 at 12:43 pm

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం అక్కినేని వారి కోడ‌లు స‌మంత‌తో శాకుంతలం సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ పౌరాణిక ప్రేమ క‌థ‌లో దేవ్ మోహన్ స‌మంత‌కు జోడీగా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి క‌రోనా సెకెండ్ వేవ్ అడ్డు ప‌డింది.

దాంతో షూటింగ్‌కు బ్రేక్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ సోషల్ డ్రామాను రూపొందించేందుకు గుణ‌శేఖ‌ర్‌ ప్లాన్ చేస్తున్నారట.

అంతేకాదు, త్వ‌ర‌లోనే చిరును క‌లిసి క‌థ చెప్పి.. మెగా ఆఫ‌ర్ అందుకునేందుకు గుణ‌శేఖ‌ర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, గ‌తంలో చిరు హీరోగా గుణశేఖ‌ర్ తెర‌కెక్కించిన‌ చూడాలని ఉంది చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ కాంబో సెట్ అవుతుందో.. లేదో..? చూడాలి.

మెగా ఆఫ‌ర్ కోసం స‌మంత డైరెక్ట‌ర్ ప్ర‌య‌త్నాలు?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts