గ‌ర్భ‌వ‌తి అంటూ వార్త‌లు..మండిప‌డ్డ చిన్నయి!

ప్ర‌ముఖ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్న‌యి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్నో పాట‌ల‌ను త‌న మ‌ధుర‌మైన గాత్రంతో ఆల‌పించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ భామ‌.. సామాజిక అంశాలు, సమజంలో స్త్రీలు ఎదుర్కోంటున్న సమస్యలపై స్పందిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంటుంది. ఇదిలా ఉంటే.. చిన్మయి ప్రముఖ నటుడు రాహుల్ రావింద్రన్‏ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల చిన్మయి తన భర్త రాహుల్ సోదరుడి వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను […]

ఆగిపోయిన మెహ్రీన్ పెళ్లి..అత‌డితో సంబంధం లేదంటూ పోస్ట్‌!

ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్.. ఈ మ‌ధ్యే హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో నిశ్చితార్థం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. రాజస్థాన్‌లో ఎంతో ఘ‌నంగా వీరి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా జ‌ర‌గ‌నుంద‌ని ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు వీరి పెళ్లి ఆగిపోయింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మెహ్రీన్ ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. `భవ్య బిష్ణోయ్‌తో నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. ఈ నిర్ణయం మేము […]

ఏపీ వాసుల‌కు గుడ్‌న్యూస్‌..భారీగా ప‌డిపోయిన క‌రోనా కేసులు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. నిన్న కూడా క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి.. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

ప్ర‌గ్యా వెంట ప‌డ్డ బెగ్గ‌ర్స్‌..హ‌డ‌లిపోయిన హీరోయిన్‌:వీడియో వైర‌ల్‌

ప్ర‌గ్యా జైస్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కిస్తున్న అఖండ సినిలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌గ్యాకు ఓ ఊహించ‌ని సంఘ‌ట‌న ఎదురైంది. ఉదయాన్నే జిమ్ పూర్తి చేసుకుని వచ్చిన ప్రగ్యాపై ఒక్కసారిగా మేడమ్ మేడమ్ దానం చేయాలంటూ క‌నీసం మాస్క్ కూడా ధ‌రించ‌కుండా పైన పడిపోయారు బెగ్గర్స్. వారిని చూసి హ‌డ‌లిపోయిన ప్ర‌గ్యాకు.. ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. […]

వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారా…?

బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు అమీర్ ఖాన్ . తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశాడు. అమీర్ ఖాన్, కిరణ్ రావుకి వివాహం జరిగి 15 సంవత్సరాలు అయింది. ఈ జంటకు కుమారుడు ఆజాద్ రావు ఖాన్ ఉన్నాడు. అమీర్ కిరణ్ సంయుక్తంగా చేసిన ప్రకటన మేరకు ఈ 15 సంవత్సరాల్లో మేము జీవితకాల అనుభవాలు, ఆనందం అలాగే అనేక విషయాలను పంచుకున్నామని తెలిపారు. మా […]

ప‌వ‌న్‌-రానా సినిమాకు ఆస‌క్తిక‌ర టైటిల్‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. కొంద షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ […]

సూప‌ర్ థ్రిల్లింగ్‌గా అమ‌లాపాల్ `కుడి ఎడమైతే` టీజ‌ర్‌!

అమలాపాల్‌, రాహుల్‌ విజయ్ కీల‌క పాత్ర‌ల్లో యూ టర్న్ ఫేమ్ ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుద‌ల కానుంది. ఇటీవ‌ల విడుద‌లైన మోషన్‌ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే తాజా ఈ సిరీస్ టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మీకెప్పుడైనా లైఫ్ లో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరిగినట్లు అనిపించిందా? అనే […]

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

ఏపీ ప్రభుత్వం రాష్ర్టంలోని నిరుద్యోగుల కోసం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై రచ్చ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దీని ప్రకారం జూలైలో మొత్తం 1238 ఎస్సీ, ఎస్టీ డిఏ బ్యాక్ లాగ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తామని ప్రకటించింది. కాగా… ఇప్పటికే అనుమతించిన 802 పోస్టుల్లో 432 ఎస్సీ 370 ఎస్టీ లకు చెందిన పోస్టులుండగా… తాజాగా కూడా మరో 600 పై చిలుకు పోస్టులున్నాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ జాబ్ క్యాలెండర్ […]

మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఇలా!

రోజు రోజుకు మండిపోతున్న పెట్రోల్ ధ‌ర‌కు సామాన్యలు హ‌డ‌లెత్తిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుసరిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరలు పెంచుకుంటూ పోతుండ‌డంతో.. వాహనం నడపాలంటేనే ప్ర‌జ‌లు వణికిపోతున్నారు. ఇప్ప‌టికే సెంచరీ దాటిన పెట్రోల్ ధర.. శ‌నివారం మ‌ళ్లీ పెరిగింది. లీటర్ పెట్రోల్ ధరను చమురు కంపెనీలు 35 పైసలు పెంచాయి. అయితే డీజిల్ ధరలను మాత్రం పెంచలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్ రేట్స్ ఇలా ఉన్నాయి.. తాజా పెంపుతో ప్రస్తుతం తెలంగాణ రాజధాని […]