గ‌ర్భ‌వ‌తి అంటూ వార్త‌లు..మండిప‌డ్డ చిన్నయి!

ప్ర‌ముఖ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్న‌యి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్నో పాట‌ల‌ను త‌న మ‌ధుర‌మైన గాత్రంతో ఆల‌పించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ భామ‌.. సామాజిక అంశాలు, సమజంలో స్త్రీలు ఎదుర్కోంటున్న సమస్యలపై స్పందిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంటుంది.

ఇదిలా ఉంటే.. చిన్మయి ప్రముఖ నటుడు రాహుల్ రావింద్రన్‏ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల చిన్మయి తన భర్త రాహుల్ సోదరుడి వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. అందులో ఆమె చీరకట్టులో ఉంది.

అయితే చీర కట్టిన విధానం వల్ల ఆమె బేబీ బంప్ తో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంకేముంది.. చిన్న‌యి గ‌ర్భ‌వ‌తి అంటూ ప్ర‌చారం ఊపందుకుంది. ఈ ప్రచారంపై తాజాగా చిన్మయి మండిప‌డింది. ఈ సంద‌ర్భంగా తాను గర్భవతిని కాదని చెప్పిన ఆమె.. తాను మ‌డిసార్ ధరించాన‌ని, అందువ‌ల్లే నా పొట్ట పెద్ద‌దిగా క‌నిపిస్తుంద‌ని తెలిపింది. ఇక ఒకవేళ భవిష్యత్తులో నా ప్రెగ్నెన్సీ గురించి.. పిల్లల గురించి చెప్పాలనిపిస్తే చెప్తా.. లేదంటే లేదు. ఇప్పటికైన నాపై రూమర్స్ క్రియేట్ చేయడం ఆపేస్తే మంచిద‌ని చిన్న‌యి సోష‌ల్ మీడియా ద్వారా పేర్కొంది.