ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్.. ఈ మధ్యే హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో ఎంతో ఘనంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా జరగనుందని ప్రకటించారు.
అయితే ఇప్పుడు వీరి పెళ్లి ఆగిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా మెహ్రీన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. `భవ్య బిష్ణోయ్‌తో నా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాను. ఈ నిర్ణయం మేము ఇద్దరం కలిసి తీసుకున్నాం. మేము పెళ్లి చేసుకోవడం లేదు. ఈ రోజు నుంచి నాకు.. భవ్య బిష్ణోయ్, అతడి కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు.
తాను ఇష్టపూర్వకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నా. ఇక నా సినీ కెరీర్‌పై మరింత దృష్టి పెడతా` అంటూ మెహ్రీన్ ట్వీట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది. అయితే మెహ్రీన్ ఎందుకు భవ్య భిష్నోయితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుందో తెలియాల్సి ఉంది.