ప్ర‌గ్యా వెంట ప‌డ్డ బెగ్గ‌ర్స్‌..హ‌డ‌లిపోయిన హీరోయిన్‌:వీడియో వైర‌ల్‌

ప్ర‌గ్యా జైస్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కిస్తున్న అఖండ సినిలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌గ్యాకు ఓ ఊహించ‌ని సంఘ‌ట‌న ఎదురైంది.

ఉదయాన్నే జిమ్ పూర్తి చేసుకుని వచ్చిన ప్రగ్యాపై ఒక్కసారిగా మేడమ్ మేడమ్ దానం చేయాలంటూ క‌నీసం మాస్క్ కూడా ధ‌రించ‌కుండా పైన పడిపోయారు బెగ్గర్స్. వారిని చూసి హ‌డ‌లిపోయిన ప్ర‌గ్యాకు.. ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. వారి నుంచి తప్పించుకుని ఆమె వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించినా..వారు మాత్రం ముందుకు క‌ద‌ల‌నివ్వ‌కుండా నిల‌బ‌డ్డారు.

ఇక చివ‌ర‌కు ఎలాగోలా కారెక్కిస ప్ర‌గ్యా.. తన దగ్గరున్న డబ్బులన్నీ వాళ్లకే ఇచ్చేసింది. అయినాస‌రే కారు వెళ్తున్న స‌మ‌యంలోనూ ఇంకా డ‌బ్బు ఇవ్వాలంటూ వెంట ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలు కామెంట్లు చేస్తున్నారు.