సెలూన్ బిజినెస్ ని స్టార్ట్ చేయనున్న సందీప్..?

టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నూతనంగా స్టైలిష్ వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. నిర్మాతగా మూవీలు చేస్తూనే… బిజినెస్ బాట పట్టాడు. ఇప్పటికే హోటల్ బిజినెస్ లో లాభాలు ఆర్జిస్తున్న ఈ యువ హీరో తాజాగా హెయిర్ సెలూన్ బిజినెస్ లో కూడా రాణించాలని చూస్తున్నాడు. ఇప్పటకే క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నే సందీప్ కిషన్ అమరావతిలో సెలూన్ నడుపుతున్నాడు. అంతే కాకుండా విజయవాడలో ఈ నెల 5న మరో సెలూన్ ని ఓపెన్ చేస్తున్నాడు.

సందీప్ కిషన్ అందాల రాశి లావణ్య త్రిపాఠి కలిసి నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ హాకీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కింది. డిఫరెంట్ కథాంశంతో వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించారు. యావరేజ్ టాక్ తెచ్చుకుని ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఈ హీరో నటించిన గల్లీ రౌడీ త్వరలోనే విడుదల అవుతుంది. డిఫరెంట్ సినిమాలు తీసే వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ మూవీలో హీరోగా చేస్తున్నాడు .