కొత్త వాళ్ల‌కు బాబుపై న‌మ్మ‌కం క‌ల‌గ‌ట్లేదా..? అందుకే రివ‌ర్స్ గేర్‌..!

రోజుకు 18 గంట‌లు అలుపెరుగ‌కుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. నెల‌కు క‌నీసం రెండు చొప్పున నూత‌న ప‌థ‌కాలు ప్ర‌వేశ పెడుతున్నారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. కొత్త‌గా తీసుకొచ్చిన `1100` ప‌థ‌కం జోరుమీదుంది. వీటికితోడు నంద్యాల ఉప ఎన్నిక‌లో ఊహించ‌ని మెజారిటీతో గెలుపు సొంతం. కాకినాడ‌లో లెక్క‌కు మించిన వార్డుల సొంతం. ఇలా ఇంత‌గా అన్ని విధాలా దూసుకుపోతున్నా.. టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుపై  న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేదా?  ఆయ‌న‌ను ఎవ‌రూ విశ్వ‌సించ‌డం లేదా? అంటే ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి […]

లేడీ ఎమ్మెల్యేపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌….బాబు షాకింగ్ డెసిష‌న్‌

ఏపీలో ఓ లేడీ ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు చాలా సీరియ‌స్‌గా ఉన్నారు. స‌ద‌రు లేడీ ఎమ్మెల్యే ప‌దే ప‌దే త‌న చ‌ర్య‌ల ద్వారా పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లిగిస్తుండ‌డంతో చంద్ర‌బాబు ఆమెపై ఇప్ప‌టికే ఇంటిలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. టీడీపీకి కంచుకోట అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు, చింత‌ల‌పూడి ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీత‌ల సుజాత మ‌ధ్య కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది.  గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ […]

మోడీ మార్క్‌.. బాబును తొక్కి పెడుతున్నారా

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంటే సామాన్యుడు కారు! అని ఆయ‌న గురించి తెలిసిన వాళ్లు ప‌దే ప‌దే చెబుతుంటారు. గుజ‌రాత్‌ను పాలించిన స‌మ‌యంలో ఇష్ర‌త్ జ‌హాన్ కేసును తిర‌గ‌తోడిన కార‌ణంగా ఆ రాష్ట్రానికి చెందిన ఓ న్యాయ‌మూర్తికే మోడీ వాత పెట్టారు. పోలీసు అధికారుల‌ను శంక‌రగిరి మాన్యాలు ప‌ట్టించారు. అలాంటి మోడీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు మాట వింటార‌ని, బాబు చెప్పిన‌ట్టు న‌డుచుకుంటార‌ని అనుకోవ‌డం భ్ర‌మేన‌ని చెబుతున్నారు. తాజాగా జ‌రిగిన, జ‌రుగుత‌న్న ప‌రిణామాలు ఈ విష‌యాన్నే […]

కూతురు కోసం టీడీపీ మంత్రి తెగింపు..!

రాజ‌కీయాల్లో ప్ర‌జా సేవ క‌న్నా సొంత సేవ ఎక్కువైన విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు. ప్ర‌స్తుతం ఈయ‌న టీడీపీలో ఉన్నా.. మ‌న‌సు మాత్రం ఈ పార్టీలో లేద‌ని అంటున్నారు ఈయ‌న అనుచ‌రులు. టీడీపీలో ఈయ‌న త‌న‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేద‌ని భావిస్తుండ‌డ‌మే కాకుండా, త‌న వార‌సురాలికి కూడా ప్రాధాన్యం ఉండ‌ద‌ని డిసైడ్ అయ్యార‌ట‌.  దీనికి కొన్ని […]

ఈ త‌మ్ముళ్ల‌పై బాబు నిఘా వెన‌క‌..!

త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌ల‌కు పాఠాలు చెప్ప‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న నేత టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీని, ప్ర‌జ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేస్తూ.. తోక ఝాడిస్తున్న నేత‌ల‌కు షాక్ ఇస్తూ.. దూసుకు పోవ‌డం ఆయ‌న సాధ్యం అయ్యేనా? వ‌్య‌క్తిగ‌త క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెద్ద పీట వేసే బాబు.. త‌న‌లాగానే పార్టీ నేత‌లు కూడా క్ర‌మ‌శిక్ష‌ణతో మెల‌గాల‌ని కోరుకుంటారు. అయితే, ఈ విష‌యంలోనే టీడీపీ నేత‌లకు బాబు మింగుడు ప‌డ‌డంలేదు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీలో వ‌చ్చే మ‌రో 30 […]

నాడు వై ఎస్ చేసిన తప్పునే .. నేడు బాబు చేస్తున్నాడా ?

ఏపీలో అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం తిరుమ‌ల‌. ఇక్క‌డ‌కు నిత్యం ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌క్తులు  వ‌చ్చి శ్రీవారిని ద‌ర్శిస్తారు. అన్య మ‌త‌స్తుల‌కు, అన్య మ‌త ప్ర‌చారాల‌కు ఈ ఆల‌యం ఎట్టి ప‌రిస్థితిలోనూ అవ‌కాశం ఇవ్వ‌దు. ఇక‌, అన్య మ‌త‌స్తులు ఆల‌యంలోకి ప్ర‌వేశించాలంటే.. తాము హిందూ ధ‌ర్మాన్ని న‌మ్ముతున్నామ‌ని, హిందూ ఆచారాల ప‌ట్ల విశ్వాసం ఉందని డిక్ల‌రేష‌న్ ఇవ్వాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. టీటీడీ చైర్మ‌న్‌గా మైద‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు […]

ఈ ఒక్క నియోజ‌క‌వ‌ర్గం కోస‌మే..బాబు మ‌దిలో మూడు ఆప్ష‌న్లు..!

లోకేష్ త‌న రాజ‌కీయ వార‌సుడిగా ప్ర‌మోట్ చేసేందుకు చంద్ర‌బాబు చ‌క్క‌టి ప్లానింగ్‌తో వెళుతున్నారు. లోకేష్‌ను మంత్రిని చేసేందుకు ఎమ్మెల్సీ చేసి ఆ వెంట‌నే కేబినెట్‌లోకి తీసేసుకున్నారు. అన్ని చ‌క్క‌గా సెట్ అయ్యాయి. ఇక లోకేష్ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో నిల‌బ‌డి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయ‌న‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు కూడా ఫుల్ స్టాప్ ప‌డిపోతుంది. ఈ ఒక్క నియోజ‌క‌వ‌ర్గం కోస‌మే చంద్ర‌బాబు నానా తంటాలు ప‌డుతున్నారు. లోకేష్ కోసం ముందుగా చంద్ర‌బాబు కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌రిశీలించారు. ఆ […]

బాబు షాక్‌తో రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై..!

క‌లియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమ‌ల‌లో సాక్షాత్తు  శ్రీ మ‌హావిష్ణువుకు సేవ చేసే భాగ్యం ల‌భించ‌డం అంత వీజీకాదు. టీటీడీ చైర్మ‌న్‌గా స‌ర్వం స‌హా అధికారాల‌ను ద‌క్కించుకుని తిరుమ‌లలో పాల‌న సాగించే అవ‌కాశం కోసం ఎంద‌రో ఎదురు చూస్తుంటారు. వీరిలో ఇటీవ‌ల కాలంలో మ‌న‌కు ప్ర‌ముఖంగా క‌నిపించిన వ్య‌క్తి గుంటూరుకు చెందిన ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు. టీటీడీ చైర్మ‌న్‌గా ఆయ‌న ప‌నిచేయాల‌ని ఎంత‌గానో భావించారు. ఇటీవ‌ల ఆ పోస్టు ఖాళీ అవ‌డంతో త‌న‌ను నియ‌మించాల‌ని టీడీపీ అధినేత‌, సీఎం […]

కేసు పోయింది.. ఇక టీడీపీతో సంబంధ‌మేంటి!!

అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎస్టీ కాదంటూ టీడీపీ నేత గుమ్మ‌డి సంధ్యారాణి హైకోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే! ఆ స‌మ‌యంలో ఆమె చిక్కుల్లో ప‌డ్డారు. అయితే ఆమె టీడీపీకి సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో వెంట‌నే సీఎం చంద్ర‌బాబు రంగంలోకి దిగి.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. సంధ్యారాణి వేసిన పిటిష‌న్ వెన‌క్కుతీసుకున్నారు. ఇది జ‌రిగిన కొద్ది రోజుల‌కే ఆమె టీడీపీ అధినేత‌కు షాక్ ఇచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆమె.. యూ ట‌ర్న్ […]