లోకేష్ లక్ష్యం.. అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే..

నారా లోకేష్.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. పార్టీకి భవిష్యత్ నేత ఈయనే అనేది అధినేత. తండ్రి చంద్రబాబు ఆశ..ఇవన్నీ సాధ్యం కావాలంటే లోకేష్ ముందుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలి.. అధ్యక్షా.. అని మాట్లాడాలి.. అదే ఇపుడు ముందున్న లక్ష్యం.. 2019 ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకే అనుకున్న తండ్రీకొడుకులకు మంగళగిరి వాసులు షాక్ ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకష్ణారెడ్డి చేతిలో ఓలమి పాలయ్యారు. సాక్షాత్తూ.. ముఖ్యమంత్రి కుమారుడే (చంద్రబాబు అప్పుడు సీఎం) ఓటమి పాలైతే ఇక పరిస్థితేంటి అని తెలుగు తమ్ముళ్లు, నాయకులు తలలు పట్టుకున్నారు. ఏం చేస్తాం.. ప్రజా తీర్పు అలా ఉంది అని సర్దుకుపోవడం తప్ప ఎవరూ ఏమీ చేయలేరు.

అయితే 2024 ఎన్నికల్లో మాత్రం లోకేష్ ఎమ్మెల్యేగా గెలవాల్సిందే అని చంద్రబాబు ఇప్పటినుంచే ప్లాన్స్ రూపొందిస్తున్నారని తెలిసింది.  అందులో భాగంగానే కుమారుడిని చంద్రగిరి నుంచి బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నారు. చంద్రగిరి చంద్రబాబు సొంత ఊరు. అక్కడ టీడీపీకి మంచి పట్టు ఉంది. అయితే ఇవన్నీపార్టీలో జరుగుతున్న పరిణామాలు మాత్రమే. చివరికి ఏం జరుగుతుందో 2024 వరకు ఎదురు చూడాల్సిందే.