బాబు వెస్ట్ టూర్..వైసీపీ ఫెయిల్ చేస్తుందా?

మరో సరికొత్త కార్యక్రమంతో చంద్రబాబు ప్రజల్లోకి వెళుతున్నారు. మొన్నటివరకు బాదుడేబాదుడు కార్యక్రమం పేరుతో ప్రజల్లో తిరిగిన టీడీపీ శ్రేణులు..ఇప్పుడు ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ అనే పేరుతో ముందుకెళ్లనున్నారు. ప్రజా సమస్యలు, వైసీపీ ప్రభుత్వం వల్ల పడుతున్న ఇబ్బందులని..టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్ళి వివరించనున్నారు. 50 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలోని  కలపర్రు టోల్‌గేట్‌ మీదుగా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ప్రారంభం కానుంది. చంద్రబాబు ఈ […]

‘బీసీ’ మంత్రం..ఈ సారి నమ్మేది ఎవరిని?

ఏపీలో అత్యధిక ఓట్లు ఉన్న బీసీ కులాల ఓట్లని మళ్ళీ కొల్లగొట్టడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బీసీలు ఎటువైపు మొగ్గితే వారిదే అధికారం..అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే బీసీ వర్గాలు మొదట నుంచి ఎక్కువగా టీడీపీకి అండగా ఉంటూ వస్తున్నారు. కానీ  గత ఎన్నికల్లో బీసీ వర్గం వైసీపీ వైపుకు వెళ్లింది..టీడీపీ కాపు రిజర్వేషన్లు వైపు మొగ్గు చూపడం, బీసీలకు అనుకున్న మేర అండగా లేకపోవడం, మరో వైపు జగన్ కాపు రిజర్వేషన్లు తన వల్ల […]

పరిటాల ఫ్యామిలీకి రెండు సీట్ల హామీ దక్కినట్లేనా?

వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లలో పోటీ చేయాలని పరిటాల ఫ్యామిలీ గట్టిగా ట్రై చేస్తుంది..ఇప్పటికే రెండు సీట్లకు పరిటాల సునీతమ్మ, శ్రీరామ్‌లు ఇంచార్జ్‌లుగా పనిచేస్తున్నారు. ఇంచార్జ్‌లుగా పనిచేస్తున్న నేపథ్యంలో..ఆ రెండు సీట్ల నుంచి తామే పోటీ చేస్తామని శ్రీరామ్ అంటున్నారు. రాప్తాడు నుంచి సునీతమ్మ, ధర్మవరం నుంచి శ్రీరామ్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వారు తమ తమ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. అయితే రాప్తాడు సీటు ఖాయమే గాని..ధర్మవరం సీటు విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు. […]

బాబు దూకుడు..ఎన్నికల హామీలు షురూ..!

ఇంకా ఎన్నికలకు ఏడాది పైనే సమయం ఉంది..కానీ ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలనే కసితో పనిచేస్తున్నారు. ఓ వైపు రోడ్ షోలు, మరో వైపు ఇంచార్జ్‌లతో భేటిలు, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడం…ఇలా ఏ మాత్రం గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలవడానికి..ఇప్పటినుంచే ప్రజలకు హామీలు కూడా ఇచ్చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేయని పనులు చెబుతూ, వచ్చే ఎన్నికల్లో […]

కర్నూలు కోటలో హిట్..ఆ ముగ్గురికి సీట్లు ఫిక్స్!

దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ కనిపిస్తోంది. వైసీపీపై వ్యతిరేకత పెరగడం కావచ్చు..చంద్రబాబుపై సానుభూతి పెరగడం కావచ్చు. టీడీపీ వైపు ప్రజలు మొగ్గు చూపడం కావచ్చు..ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనలకు భారీ స్పందన వస్తుంది. 2019 ఎన్నికల ముందు జగన్ పాదయాత్ర సమయంలో సభలకు ఎలాంటి స్పందన వచ్చిందో..అదే తరహాలో జనంలోకి వెళుతున్న బాబుకు భారీ స్పందన కనిపిస్తోంది. మహానాడు, మినీ మహానాడు, బాదుడేబాదుడే కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున […]

తగ్గని బాబు..కే‌ఈ ఫ్యామిలీ సర్దుకున్నట్లే..!

ఒకప్పుడు కర్నూలు జిల్లా టీడీపీ అంటే మొదట గుర్తుచ్చేది కే‌ఈ కృష్ణమూర్తి ఫ్యామిలీనే..ఆ జిల్లాలో కాంగ్రెస్ హవా ఉన్న సమయంలో, ఆ తర్వాత వైసీపీ హవా  నడుస్తున్న సమయంలోనూ పార్టీకి అండగా నిలబడింది ఆ ఫ్యామిలీనే. అందుకే 2014లో కృష్ణమూర్తికి డిప్యూటీ సీఎం పదవి సైతం ఇచ్చారు. అటు కే‌ఈ ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు.  అయితే 2019లో ఓటమి తర్వాత ఆ ఫ్యామిలీ కాస్త టీడీపీకి దూరం జరిగింది..తమ నియోజకవర్గాలని కూడా పట్టించుకోలేదు. దీంతో చంద్రబాబు..కే‌ఈ ఫ్యామిలీకి […]

బాబు 2.O..కర్నూలులో తేల్చేశారు..!

రాజకీయాలు ఇప్పుడు చాలా మారిపోయాయి..పాలసీ పరంగా విమర్శలు చేసుకోవడం పోయింది..వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మొదలైంది. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టడం ఎక్కువైంది. వ్యక్తిగతమైన విమర్శల దాడి టీడీపీ హయాంలోనే మొదలైంది..ఇక వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో పాటు బూతులు తిట్టడం వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదలైంది..అది ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. చంద్రబాబు, పవన్, లోకేష్‌లని వైసీపీ నేతలు ఏ రేంజ్‌లో తిట్టారో చెప్పాల్సిన పని లేదు..ఇక వారికి కౌంటరుగా టీడీపీ, జనసేన నేతలు […]

చివరి ఛాన్స్‌తో వైసీపీ హ్యాపీ..కానీ రిస్క్..!

ప్రజలని సెంటిమెంట్‌తో ఆకట్టుకోవడం రాజకీయ నాయకులకు బాగా అలవాటు అయిపోయింది..ఎన్నికల్లో గెలవడానికి సెంటిమెంట్ అస్త్రాలని గట్టిగానే వాడుతారు. గత ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలని ఓట్లు అడిగారు. దీంతో ప్రజలు ఎలాగో చంద్రబాబుని చూశాం కదా..ఒక్కసారి జగన్‌ని చూద్దామని వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. ఇక జగన్ పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారు..జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేక..వైసీపీ వాళ్ళు సంతోషంగా ఉన్నారో..ప్రజలకే క్లారిటీ తెలియాలి. ఆ విషయం పక్కన […]

ఆఖరి ఛాన్స్ అంటున్న బాబు..హామీలు షురూ..!

గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి తన పాలన ఎలా ఉంటుందో చూపిస్తానని జగన్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక జగన్ పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆయన పాలనపై సంతృప్తి వ్యక్తం చేసే వారు ఉన్నారు..అసంతృప్తి వ్యక్తం చేసేవారు ఉన్నారు. కానీ జగన్ మాత్రం తన పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు. ఇటు చంద్రబాబు ఏమో జగన్ పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరని అనుకుంటున్నారు. ఎవరి వర్షన్ వారికి ఉంది. […]