ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే టీడీపీ కంచుకోట అనే సంగతి తెలిసిందే..ఇక్కడ పార్టీకి గట్టి బలం ఉంది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఉన్నారు..అయితే గత ఎన్నికల్లో నాయకులు వ్యతిరేకత తెచ్చుకోవడం వల్ల టీడీపీకి దెబ్బ పడింది. కానీ నిదానంగా వెస్ట్ లో సీన్ మారుతూ వస్తుంది. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంటే..టీడీపీ బలపడుతుంది. ఇక టీడీపీ బలం పెరుగుతుందనే దానికి ఉదాహరణ..తాజాగా చంద్రబాబు పర్యటనకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టడమే.
ఈ మధ్య కాలంలో బాబుకు జనం నుంచి భారీ స్పందన వస్తుంది. ఎంత జనాలని తరలించిన ఆ స్థాయిలో స్పందన రావడం చాలా కష్టమైన పని. గత మూడున్నర ఏళ్లు వైసీపీ కక్ష సాధింపు చర్యలపై కసిగా ఉండటంతోనే తమ్ముళ్ళు రోడ్డు ఎక్కారు. అలాగే పన్నుల భారంతో నానా ఇబ్బందులు పడుతున్న జనం కూడా బాబు కోసం వస్తున్నారు. ఆ విషయం కర్నూలు టూర్‌లోనే అర్ధమైంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ బాబు రోడ్ షోలకు, సభలకు జనం భారీ ఎత్తున వచ్చారు.
మొదట దెందులూరులో టూర్ మొదలైంది..అక్కడే జనం భారీగా వచ్చారు. ఆ తర్వాత చింతలపూడి, పోలవరం, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో జనం భారీగా వచ్చారు. ఇక మూడోరోజు నిడదవోలు, తాడేపల్లిగూడెంల్లో పర్యటన జరిగింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇంకా భారీ స్థాయిలో జనం కనిపించారు. ముఖ్యంగా నిడదవోలులో జరిగిన రోడ్ షో సభలో జనం ఓ వేవ్‌లో కనిపించారు.
అక్కడ స్పందన భారీగా వచ్చింది…మొత్తానికి పశ్చిమ గోదావరిలో బాబు టూర్‌లతో టీడీపీకి సరికొత్త జోష్ వచ్చింది. వాస్తవానికి బాబు పర్యటించిన నియోజకవర్గాలు అన్నీ..గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినవే..ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లోనే విపరీతమైన జనాదరణ కనిపిస్తోంది. ఇక బాబు టూర్ ఫలితాన్ని టీడీపీ ఇంచార్జ్‌లు సద్వినియోగం చేసుకోవాలి..అప్పుడు వెస్ట్‌లో టీడీపీకి మెజారిటీ సీట్లు గెలుచుకునే బలం వస్తుంది.