బాలయ్య చిరు ఎప్పటికీ కలిసి నటించలేరా.. ఎందుకంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరి మధ్య అనుబంధం కూడా మనకు తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో హీరోగా నటిస్తూ ఉన్నారు. బాలయ్య, చిరంజీవి మూడు దశాబ్దాల క్రితం చిరంజీవి ,బాలకృష్ణ కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానుల సైతం అనుకుంటూ ఉండేవారు. కానీ అప్పట్లో కూడా అది వీలు పడలేదు. రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి నటిస్తారా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు కానీ ఇది జరగదని ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

No entry for 'Chiru, Balayya and Nag at shoots?

బాలయ్య, చిరంజీవి వృత్తిపరంగానే కాకుండా సినిమాల పరంగా కూడా ఎప్పుడు నువ్వా నేనా అంటూ పోటి పడుతూ ఉంటారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని కార్యక్రమాలలో మాత్రం వీరిద్దరు మంచి స్నేహితులు అన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు.కానీ సినిమా విషయానికి వచ్చేసరికి బద్ధ శత్రువులు అన్నట్టుగా మారిపోతూ ఉంటారు. బాలయ్య ,చిరంజీవి కాకుండా వీరి అభిమానులు కూడా వీరి సినిమాలు విడుదలయ్యాయి అంటే పలు రకాలుగా ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చింది అంటే కచ్చితంగా కథ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పవచ్చు.

అసలు వీరిద్దరికీ నచ్చే కథ రానే రాదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మల్టీ స్టార్ చిత్రం అంటే కచ్చితంగా ఒక హీరో రాజీ పడాల్సి ఉంటుంది. చిరంజీవి బాలయ్యలో అలా రాజీ పడే అవకాశం ఎవరిలోనూ కనిపించలేదు. కనుక వీరిద్దరూ కాంబినేషన్లో మల్టీ స్టార్ సినిమా వస్తుంది అనుకోవడం అది ఒట్టి నమ్మకమే అని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.