హిట్ -3 సక్సెస్ అవ్వడం కష్టమేనా..?

సక్సెస్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా తేరకెక్కించిన చిత్రం హిట్ -2. ఈ చిత్రంలో హీరోగా అడివి శేషు నటించారు. ఈ సినిమాని డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. గతంలో విడుదలైన హిట్ సినిమాకి ఈ చిత్రం సీక్వెల్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం సికెల్స్ ఇలా వస్తూనే ఉంటాయని నిర్మాత నాని గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు. దీంతో ఈ సినిమా పైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఆ అంచనాల నేపథ్యంలో నిన్నటి రోజున హిట్2 సినిమా థియేటర్లోకి రావడం జరిగింది. హిట్ -3 సినిమాలో ఎవరు హీరో అనే విషయంపై క్లైమాక్స్లో క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇందులో హీరోగా నాని నటిస్తూ ఉన్నారు.

Adivi Sesh hints at HIT 3 at HIT 2 trailer launch. Here's what he said -  India Todayహిట్, హిట్ -2 లకు నిర్మాతగా వ్యవహరించిన నాని హిట్ -3 కి తానే హీరో గా నటిస్తానంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.అయితే ఈ సినిమా నాని అభిమానులను మెప్పించలేదు అంటూ వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. ఎందుచేత అంటే సీరియస్ పాత్రలో నాని గతంలో వి సినిమాలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందుకు కారణంగానే నాని హిట్ -3 సినిమా కాస్త సక్సెస్ కావడం కష్టమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

HIT3 is a Crazy Multi-starrer set in USAఇప్పుడు వచ్చిన హిట్-2 ప్రేక్షకులను అంతంత మాత్రమే ఆకట్టుకోవడంతో మరింత చర్చనీయాంశంగా మారుతుంది ఈ విషయం. హిట్ సినిమాకు ఉన్నంత క్రేజ్ అంత స్థాయిలో మాత్రం ఈ సినిమా సీక్వెల్ కు లేదన్న వార్తలు బాగా వినిపిస్తూ ఉన్నాయి.ఈ సినిమా నిర్మాతలకు పోయేదేమీ లేకున్నప్పటికీ తర్వాత వచ్చే సీక్వెల్ పైన కచ్చితంగా ఈ సినిమా గట్టి ఎఫెక్ట్ చూపిస్తుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో హిట్ -3 సినిమా ఆగస్టు పోవడం కష్టమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా కొత్తగా కథ మారిస్తే తప్ప హిట్ త్రీ సినిమా సక్సెస్ అయ్యే ఛాన్సులు లేవని సమాచారం. మరి హీరో నాని ఏం చేస్తారో చూడాలి.