జిన్నా టవర్ బీజేపీ పుట్టి ముంచుతుందా?

హిందువులు భారతీయ జనతా పార్టీని- తమ సొంత పార్టీగా అభిమానించి ఎంతగా నెత్తిన పెట్టుకుంటారో ఏమో తెలియదు గానీ.. ఇతర మతాలు- అంటే ముస్లింలు, క్రిస్టియన్లు మాత్రం అపరిమితంగా ద్వేషించే వాతావరణాన్ని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థంగా తయారు చేస్తున్నారు. భారతదేశమే పరమత సహనానికి పుట్టినల్లు. అయితే.. సోము వీర్రాజు మాత్రం.. ఇతర మతాల మీద ద్వేషబీజాలు ప్రజల్లో నాటి.. తద్వారా.. పబ్బం గడుపుకోవడానికి.. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు మూటగట్టుకోవడానికి తెగిస్తున్నారు. అయితే.. […]

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో వీళ్లే!

సోమువీర్రాజు.. చాలా పంతం పట్టి మరీ.. ఏపీ బీజేపీ పగ్గాలను అందింపుచ్చుకున్నారు. పార్టీ మీద అలిగి, కోపం వ్యక్తం చేసిన తర్వాత గానీ.. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. అయితే.. అంత కష్టపడి దక్కించుకున్న పార్టీ పదవికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది. చీప్ లిక్కర్ వ్యవహారం ఆయన పదవికి ఎసరు పెట్టింది. ఇప్పటికే ఆయన మీద గుస్సా అయిన అధిష్ఠానం అనధికారికంగా సంజాయిషీ అడిగినట్టు తెలుస్తోంది. కాగా.. సోము వీర్రాజు పదవీకాలం సుమారుగా మరో ఆరునెలల […]

సోమును తీసేస్తే తప్ప.. ఈ పాపానికి నిష్కృతి లేదు!

భారతీయ జనతా పార్టీ విలువలు పాటించే, సిద్ధాంతాలు ఉన్న పార్టీగా చెప్పుకుంటూ ఉంటుంది. కొందరు ఆ మాటల్ని నమ్ముతారు కూడా. ఆ పార్టీకి బలం లేకపోయినా, ఆ పార్టీని నమ్మకపోయినా, ఓట్లు వేయకపోయినా.. సిద్ధాంతాల విషయంలో గౌరవంగా చూసేవారు కొందరు తప్పకుండా ఉంటారు. అలాంటి వారందరి దృష్టిలోనూ.. పార్టీ పరువును భూస్థాపితం చేసేశారు.. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చీప్ లిక్కర్ వ్యవహారాన్ని కెలికి.. తానేదో తాగుబోతుల మేలుకోసం, వారికి డబ్బు మిగలబెట్టడం కోసం […]

శైలజా..రేవంత్‌.. మధ్యలో 15 లక్షలు

కాంగ్రెస్‌ పార్టీ.. జాతీయస్థాయిలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాభవం కోల్పోయింది. తెలంగాణలో చెప్పుకోదగ్గ ప్రజాప్రతినిధులు ఉన్నారు కానీ ఏపీలోమాత్రం దారుణం.. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కూడా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన అనంతరం కొద్దిరోజుల పాటు ఏపీసీసీ, టీపీసీసీ కమిటీలో ఒకే చోట నిర్వహించారు. ఏపీసీసీ ఇందిరాభవన్‌నుంచి కార్యకలాపాలు నిర్వహించగా.. టీపీసీసీ గాంధీభవన్‌ నుంచి నిర్వహించింది. ఆ తరువాత ఏపీసీసీ కార్యాలయం విజయవాడికు మారిపోయింది. విజయవాడకు మారిన అనంతరం […]

జనంలో కాదు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌

ఆర్‌కే అలియాస్‌ ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. ఈ పేరు వింటే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఓ భరోసా.. ఓ నమ్మకం.. అయితే ఇది ఇప్పుడు కాదు.. గతంలో..ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలుపొందిన నాటి సంగతి. ప్రజాపక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడి 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాడు. కేవలం 12 ఓట్లతో మంగళగిరి ఎమ్మెల్యేగా ఎన్నికై వార్తల్లో నిలిచాడు. ఆ తరువాత జనం కోసం నిలబడి వారి మద్దతు కూడగట్టాడు. […]

అధికారంపై ఎన్ని ఆశలో..

ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి బాగానే పట్టుంది.. పార్టీ హైకమాండుకు ఉత్తర దేశంపై దిగులు లేదు. బాధంతా దక్షిణాదిపైనే.. అరె.. ఈ ప్రాంతంలో పార్టీని అధికారంలోకి తెద్దామంటే కుదరడం లేదు. ఒక్క కర్ణాటకలోనే సాధ్యమైంది. తమిళనాడులో అస్సలు దగ్గరకు రానీయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అయినా పార్టీ పరువు నిలుపుకుందామనేది పెద్దల ఆలోచన. తెలంగాణలో కాస్తో..కూస్తో పార్టీ బండి లాగుతోంది. ఏపీలోనే పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు నాయకులు అస్సలు చేయడం లేదని […]

ఆ నలుగురికీ స్పెషల్ క్లాస్!

విద్యార్థులు అందరికీ కలిపి పాఠం చెబితే అది క్లాసు. కొందరు మొద్దు విద్యార్థులను లేదా కొందరు అత్యంత ఇంటెలిజెంట్ విద్యార్థులను ప్రత్యేకంగా పరిగణించి.. వారి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి వారికి విడిగా పాఠం చెబితే అది స్పెషల్ క్లాస్. రాష్ట్ర బీజేపీ నాయకులతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందరికీ ఉమ్మడిగా క్లాస్ తీసుకుంటే.. ఆ నలుగురికి మాత్రం స్పెషల్ క్లాస్ తీసుకున్నారుట. నాయకులు కంగారెత్తిపోయేలా.. మాట్లాడారట. ఇంతకీ ఆ నలుగురు […]

మధ్యలో దూరితే.. నమ్మేదెవరు?

అమిత్ షా.. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక దారి చూపించాడు. రాష్ట్రంలో పార్టీ బలం పెంచుకోవడం లక్ష్యం. అందుకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పోరాటాలు జరుగుతూ ఉంటే వాటన్నింటిలోనూ తలదూర్చమని ఆయన చెప్పాడు. ప్రజలు దేనికోసం ఉద్యమిస్తున్నా సరే.. వారి వెన్నంటి ఉండమని అన్నాడు. ఆ కోటాలో భాగంగానే.. అమరావతి రాజధాని పోరాటంలో భాగం పంచుకోవాలని అనడం కూడా. అమరావతి రాజధాని కోసం రైతులు మహాపాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో.. ఆ పాదయాత్ర తీవ్రత ఏదో […]

తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం సద్దుమణుగుతోంది.. సమస్య పరిష్కరాం దిశగా ఇరు రాష్ట్రాల అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. అయితే ఉన్నట్టుండి రెండు తెలుగు రాష్ట్రాల పాలకుల మధ్య మాటల యుద్దం ప్రారంభమైంది. నీటి సమస్య అంటే.. అది మామూలే.. తప్పదు అనుకోవచ్చు. మరి డబ్బుల విషయం.. అంటే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి మంత్రులు కామెంట్ చేసుకోవడాన్ని జనం విచిత్రంగా చూస్తున్నారు. ఎవరి రాష్ట్రాలు వారివి.. ఎవరి సమస్యలు వారివి.. ఎవరి పథకాలు వారివి.. అంతే.. […]