నంద్యాల‌లో 8,9 రౌండ్ల‌లో టీడీపీకి మెజార్టీ ఎందుకు త‌గ్గింది

నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్‌లో టీడీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వ‌ర‌కు 9 రౌండ్ల కౌంటింగ్ అవ్వ‌గా 9 రౌండ్ల‌లోను టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికే మెజార్టీ ల‌భించింది. 9 రౌండ్లు ముగిసే స‌రికి టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి 18,132 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. వైసీపీ శ్రేణులు నిరాశ‌లో మునిగిపోయాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇక 9 రౌండ్ల‌లోను టీడీపీకే మెజార్టీ వ‌చ్చినా ప‌ట్ట‌ణంలో టీడీపీకి ముందునుంచి భారీ మెజార్టీ వ‌స్తుంద‌ని అంద‌రూ […]

నంద్యాల రూర‌ల్‌లో వైసీపీ ఆశ నిరాశే

నంద్యాల ఉపఎన్నిక కౌంటింగ్ తొలి రౌండ్ నుంచే అధికార టీడీపీ దూసుకుపోతోంది. మొత్తం 19 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఇప్ప‌టి వ‌ర‌కు 6 రౌండ్ల లెక్కింపు పూర్త‌య్యింది. నంద్యాల రూర‌ల్ మండ‌లంలోని ఐదు రౌండ్ల‌లో టీడీపీకి ఏకంగా 13135 ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది. నంద్యాల రూర‌ల్ మండ‌లంతో పాటు గోస్పాడు మండ‌లంపై ముందునుంచి విప‌క్ష వైసీపీ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. ఈ రెండు మండ‌లాల మెజార్టీతో తాము గెలుస్తామ‌ని, టౌన్‌లో టీడీపీకి మెజార్టీ వ‌చ్చినా దానిని […]

నంద్యాల అభ్య‌ర్థుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ల షాక్‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల కౌంటింగ్ ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. మొత్తం 19 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు. ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు చేశారు. అయితే పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో అభ్య‌ర్థులకు ఉద్యోగులు షాక్ ఇచ్చారు. మొత్తం 250 ఓట్లలో 211 ఓట్లు ఎవ్వ‌రికి ఓట‌య‌లేదు. ఇక మిగిలిన 39 ఓట్లు చెల్ల‌కుండా పోయాయి. నంద్యాల‌లో ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అక్క‌డ ఉద్యోగ‌స్తులు భ‌యాందోళ‌న‌తోనే ఏ పార్టీకి ఓట్లు […]

టీడీపీలోకి వాణీ విశ్వ‌నాథ్‌… ముహూర్తం ఫిక్స్‌

ఏపీలో రాజ‌కీయం ఎంత రంజుగా ఉందో చూస్తూనే ఉన్నాం. 2019 ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ మ‌ధ్య వార్ అదిరిపోతోంది. తాజాగా జ‌రుగుతోన్న నంద్యాల ఉప ఎన్నిక 2019 ఎన్నిక‌ల‌కు ఓ టీజ‌ర్‌గా అంద‌రూ అభివ‌ర్ణిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రికి వారు టీడీపీలోకో, వైసీపీలోకో త‌మ వీలును బ‌ట్టి జంప్ చేసేస్తున్నారు. ఇక పార్టీలు కొంత‌మందిని త‌మ అవ‌స‌రం కోసం ఆహ్వానిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే నిన్నిటి త‌రం సీనియ‌ర్ హీరోయిన్ వాణీ విశ్వ‌నాథ్ […]

నంద్యాల తొలి రౌండ్ లెక్కింపు ఓట్లు ఇవే

నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ మ‌రి కొద్ది సేప‌ట్లో ప్రారంభంకానుంది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఎన్నిక‌లో మొత్తం 1.73 ల‌క్ష‌ల ఓట్లు పోల‌య్యాయి. ఇక ముందుగా 250 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కిస్తారు. ఆ త‌ర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఉంటుంది. నంద్యాలలో తొలి రౌండ్ నంద్యాల రూరల్ మండలాన్ని లెక్కించనున్నారు. తర్వాత నంద్యాల పట్టణం ఓట్లను లెక్కిస్తారు. చివరగా ఉత్కంఠ రేపుతున్న గోస్పాడు మండలం ఓట్లను కౌంట్ చేస్తారు. తొలి మూడు రౌండ్లలో గ్రామీణ […]

బాబాయి.. బావ‌.. మ‌ధ్య‌లో మ‌హేష్‌.. ఓ పొలిటిక‌ల్ సిత్రం!

ఒక ప‌క్క బాబాయి.. మ‌రో ప‌క్క సొంత బావ! ఇప్పుడు ప్రిన్స్ మ‌హేష్‌కి పెద్ద అగ్నిప‌రీక్ష‌గా మారిపొయింది ప‌రిస్థితి. వీరిద్ద‌రూ ఇప్పుడు మ‌హేష్‌ను చెరోప‌క్క వాయించేస్తున్నార‌ని స‌మాచారం. దీనికి కార‌ణం.. ఇద్ద‌రూ చెరో పార్టీ కావ‌డం, ఇద్ద‌రూ మ‌హేష్ మ‌ద్ద‌తు కోరుకోవ‌డ‌మే. బాబాయి ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు, బావ గ‌ల్లా జ‌య‌దేవ్‌ల వైఖ‌రితో మ‌హేష్ ఇప్పుడు నానాతిప్ప‌లు ప‌డుతున్నాడ‌ని అంటున్నారు ఫిలింన‌గ‌ర్ జ‌నాలు. వీరిద్ద‌రూ అధికార‌, విప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌లు కావ‌డంతో మ‌హేష్ ఇద్ద‌రినీ.. సంతృప్తి ప‌ర‌చ‌లేక […]

పురందేశ్వ‌రిలో మార్పు వెన‌క మ‌రిది మీద ప్రేమ ఉందా..లేదా..!

ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి! అన్న ఎన్టీఆర్ కుమ‌ర్తె అయినా.. త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందిన నాయ‌కురాలు. ప‌రుచూరు నుంచి రాజ‌కీయాల్లో ప్ర‌వేశించిన ఈమె.. త‌న‌కంటూ ప్ర‌త్యేక ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకున్నారు. అన్న‌గారు మ‌ర‌ణించే వ‌ర‌కు ఆమె భ‌ర్త ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు క్రియాశీల‌క రాజ‌కీయాల్లో చురుగ్గా ఉండ‌గా, ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో ఆయ‌న తెర‌మ‌రుగ‌య్యారు. ముఖ్యంగా టీడీపీలో జ‌రిగిన కొన్ని కీల‌క ప‌రిణామాల విష‌యంలో క‌ల‌త చెందిన పురందేశ్వ‌రి.. ఆ పార్టీ త‌న తండ్రి స్థాపించిన‌దే అయిన‌ప్ప‌టికీ.. […]

ఆమ్ర‌పాలి ఓ యూత్ ఐకాన్‌… ఏం చేసినా అంత క్రేజ్ ఏంటో

ఆమ్ర‌పాలి.. ఆమ్ర‌పాలి.. ఇప్పుడు ఈ పేరు సోష‌ల్ మీడియాలో మారుమోగుతోంది. ఏకంగా ఆమ్ర‌పాలి చేతిలో వినాయ‌కుడిని పెట్టిన‌ట్లు ఉండే విగ్ర‌హం ప్ర‌తిష్ఠించారంటే.. అర్థం చేసుకోవ‌చ్చు ఆమె ఎంత‌టి పాపులరో! ఇలాంటి వ‌న్నీ ఎక్క‌డో త‌మిళ‌నాడులో చూస్తుంటాం. సినీ న‌టులకో, రాజ‌కీయ నాయ‌కుల‌కో ఇలాంటివి చేశార‌ని వింటుంటాం! కానీ ఆమె వీట‌న్నింటికీ అతీతం. ఆమె ఒక యూత్ ఐకాన్‌! ఆమె చీర కట్టినా న్యూసే.. మోడ్ర‌న్ డ్రెస్ వేసినా న్యూసే!! అన‌తి కాలంలోనే ఆమె ఇంత పాపుల‌ర్ అవ‌డానికి […]