ఓ పెద్ద తుఫాను తీరం దాటింది! నంద్యాల ఉప పోరు ఫలితం వెల్లడైపోయింది. గెలుపు అధికార పక్షం సైకిలెక్కేసింది. రివ్వున తిరుగుతుందని అనుకున్న ఫ్యాన్‌కు రెక్కలు తెగిపోయాయి. ఇక, మళ్లీ ఎన్నికలు రావాలంటే ఏడాదిన్నరకు పైగా ఆగాల్సిందే. అయితే, ఈ నంద్యాల పోరు.. నిన్నటి ఫలితం అటు అధికార పక్షానికి, ఇటు విపక్షానికీ అనేక పాఠాలు నేర్పుతోంది. భవిష్యత్ వ్యూహాలకు ఎలా పదును పెట్టాలి? ప‌్రజల నాడి ఏమిటి? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత సంయమనంగా వ్యవహరించాలి? ఎంత […]
Category: Politics
టీడీపీలోకి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. లిస్ట్ ఇదే..?
నంద్యాల ఫలితం వైసీపీకి 2019లో అధికారం దక్కుతుందా ? అన్న ప్రశ్నకు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం కష్టమే అన్న ఆన్సర్లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. వైసీపీ వాళ్లు కూడా ఇదే విషయమై ఆందోళనతో చర్చించుకుంటున్నారు. జగన్‌కు బలమైన రాయలసీమలోనే ఈ పరిస్థితి ఎదురవ్వడంతో సీమలో వైసీపీ ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ మూడేళ్లలో జగన్ తీరుతో విసిగిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కేశారు. 21 మంది ఎమ్మెల్యేలు నంద్యాల, అరకు ఎంపీ […]
కాకినాడ పోరు డిఫరెంట్
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచే జనాలు భారీ ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఇళ్ల నుంచి తరలి వచ్చి మరీ ఓట్లు వేసేందుకు బారులు తీరుతున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. దీని ఫలితమే ఇప్పుడు అందరికీ చర్చగా మారింది. దీని ఫలితం సెప్టెంబరు 1న వెలువడనుంది. దీంతో సెప్టెంబరు 1 అటు బాబుకు కలిసి వస్తుందా? జగన్‌కు కలిసివస్తుందా? […]
వ్యూహకర్తలకు ఏపీలో ప్లేస్ లేదా?
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. అనగానే ముందుగా ఏపీ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్‌ని నియమించుకున్నందుకు కాదు.. వ్యూహకర్త అనే కొత్త మాట విని అవాక్కయ్యారు. నిజమే.. ఇప్పటివరకూ ఇటువంటి పదాన్ని వినలేదు ఏపీ ప్రజలు! ఎన్నికల్లో గెలవడానికి సీనియర్ నాయకుల దగ్గరే బోలెడన్ని వ్యూహాలు ఉంటే.. కొత్తగా వీటన్నింటినీ అమలు చేయడానికి వేరే ప్రాంతంపు వ్యక్తి ఎందుకో అని సన్నాయినొక్కులు కూడా నొక్కిన వాళ్లు లేకపోలేదు. అయితే ఇప్పుడు ఈ పీకేల వల్ల ఏపీలో […]
శిల్పా బ్రదర్స్ సాధించిందేంటి
నంద్యాల ఉప ఎన్నిక శిల్పా బ్రదర్స్ ఇద్దరికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసిందా? వీరిని రాజకీయంగా నామరూపాలు లేకుండా చేసిందా? ఉన్న పదవులను ఒదులుకుని వస్తాయనుకున్న పదవి రాక.. రెంటికీ చెడ్డ రేవడిలా అన్నదమ్ములు ఇంటి ముఖం పట్టారా? అంటే ఔననే అంటోంది నంద్యాల ఉప ఎన్నిక. కేవలం నెల రోజుల వ్యవధిలో ఈ ఇద్దరు అన్నదమ్ముల జాతకాలను మార్చేసిన ఈ ఉప ఎన్నిక.. వీరి భవిష్యత్తు అంధకారం అయ్యేలా చేసేసింది. ఖచ్చితంగా నలభై రోజుల కిందట.. […]
కాకినాడలో ఆ రెండు పార్టీలకు ఓటేస్తే మురిగినట్టేనా..!
అవును! ఇప్పుడు కాకినాడ ఓటర్లు ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. తాజాగా ప్రారంభమైన కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఉదయం ఏడు గంటల నుంచి ప్రశాంతంగా సాగిపోతోంది. ఓటర్లు ఇక్కడ కూడా తండోపతండాలుగా పోలింగ్ బూత్‌లకు క్యూ కడుతున్నారు. మహిళలు ఇళ్లలో పనులను వాయిదా వేసుకుని మరీ ఓటేసేందుకు పోటెత్తుతున్నారు. అయితే, ఇక్కడ ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ పార్టీకి ఓటేయాలి? అనేది కాకుండా.. ఏ పార్టీకి ఓటేస్తే.. మురిగిపోతుంది? తమ ఓటు విలువ లేకుండా పోతుంది? […]
జగన్‌ని ఏకేసిన ఆ మీడియా
నంద్యాల ఉప ఎన్నిక రిజల్ట్ అనంతరం వైసీపీ అధినేత జగన్ పరువు ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బజారున పడింది. జాతీయ మీడియా జగన్‌ను ఏకిపారేసింది. ఎందుకింత అహంభావం! అంటూ నిప్పులు చెరిగింది. సీఎంనే కాల్చిపారేయాలన్న జగన్‌ని జనం తమ ఓట్లతో కాల్చేశారంటూ ఎద్దేవా చేసింది. రాజకీయాల్లో పరిణితి సాధించలేని నేత.. రేపు అధికారంలోకి వస్తే.. పాలనలో ఏం పరిణితి చూపిస్తాడంటూ.. నిప్పులు చెరిగింది. అదేసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసింది. రాజకీయంగా ఎలా వ్యవహరించాలో? […]
న్యాయమూర్తులతో బాబు కుమ్మక్కా?
ఏపీ సీఎం చంద్రబాబుపై ఆంగ్ల పత్రిక ఎకనమిక్ టైమ్స్ బాంబు పేల్చింది. న్యాయ వ్యవస్థపై బాబు పెత్తనం చేస్తున్నారని, తనకు అనుకూలంగా ఉండరని భావించే కొందరు న్యాయవాదులకు ప్రమోషన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఈ కథనం సారాంశం. నిజంగా ఈ కథనం నిజమైతే.. బాబు తీవ్ర చిక్కుల్లో పడ్డట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. విషయంలోకి వెళ్తే.. దేశంలోని అన్ని హైకోర్టులకు న్యాయమూర్తులను సుప్రీం కోర్టు కొలీజియం ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికైన వారిని రాష్ట్రపతి ఆమోదంతో ఆయా గవర్నర్లు.. ప్రమాణ […]
గోస్పాడులో వైసీపీకి ఎందుకు దెబ్బ పడిందంటే…
నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెల్లడైంది. ప్రజలు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని ఎవ్వరూ ఊహించని మెజార్టీతో గెలిపించారు. నంద్యాల రూరల్, నంద్యాల అర్బన్ విషయం పక్కన పెడితే గోస్పాడు మండలంలో కూడా టీడీపీనే ఆధిక్యాన్ని కనబరిచింది. ఈ ఉప ఎన్నిక హడావిడి ప్రారంభమైనప్పటి నుంచి గోస్పాడు మండలంలో వైసీపీకి తిరుగులేని మెజార్టీ వస్తుందని, ఆ మండలం నుంచి వచ్చే మెజార్టీయే తమను గెలిపిస్తుందని వైసీపీ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. చాలా నివేదికలు, సర్వేలు, చివరకు ప్రశాంత్ […]
