నంద్యాల‌లో టీడీపీ-వైసీపీ స‌ర్వేలు ఏం చెపుతున్నాయ్‌

నంద్యాల ఉప పోరు స‌మీపిస్తున్న కొద్దీ.. విజ‌యం ఎవ‌రిద‌నే విష‌యంపై స‌హ‌జంగానే ఆస‌క్తి నెల‌కొంటుంది.  ఏ టీ బ‌డ్డీ వ‌ద్ద చూసినా.. ఏ న‌లుగురు మాట్లాడుకున్నా.. గెలుపు స‌మాచారంపైనే మాట‌లు న‌డిచిపోతుంటాయి. ఇక‌, నంద్యాల వంటి అతి కీల‌క‌మైన ఎన్నిక‌, అదికూడా రెండు బ‌ల‌మైన ప‌క్షాలు అక్క‌డే రోజుల త‌ర‌బ‌డి తిష్ట‌వేసి మ‌రీ ప్ర‌చారం చేస్తున్న నేప‌థ్యంలో ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గంపై అంచ‌నాలు ఎలా ఉంటాయ‌నేది చెప్ప‌డం క‌ష్టం. గెలుపు నాదంటే నాద‌నే ఈ రెండు ప‌క్షాల […]

భారీ క్రికెట్ బెట్టింగ్ కుంభ‌కోణం… వెన‌క వైసీపీ ఎమ్మెల్యే!

రాష్ట్రంలో ఇటీవ‌ల కాలంలో భారీ ఎత్తున సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ యువ‌త‌ను నిర్వీర్యం చేస్తోంది.  వంద‌లు దాటి వేల రేంజ్‌కు చేరిపోయిన ఈ బెట్టింగులు ఇప్పుడు కోట్ల‌కు ఎగ‌బాకాయి. దీంతో దీనినే వ్య‌స‌నంగా భావిస్తున్న వాళ్లు త‌మ ఇల్లు.. వాకిళ్ల‌ను సైతం అమ్ముకుని జీవితాల‌ను ఈ బెట్టింగుల‌కు అంకితం చేసి.. తీవ్ర‌స్థాయిలో న‌ష్ట పోతున్నారు. ఇక‌, నెల్లూరులో ఇటీవ‌ల కాలంలో వెలుగు చూసిన క్రికెట్ బెట్టింగ్ కుంభ‌కోణం మ‌రింత క‌ల‌క‌లం సృష్టిస్తోంది. యువ‌త చెడు మార్గం ప‌ట్టకుండా […]

రేపు కొడుకు పెళ్లి… టీడీపీ ఎమ్మెల్యే ఏం చేశారంటే… ద‌టీజ్ జీవి

సొంతం లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయ‌ప‌డ‌వోయ్‌! అన్నారు గుర‌జాడ అప్పారావుగారు. వాస్త‌వానికి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవాళ్లు… లాభం మొత్తం మానుకుని మీకే సేవ‌చేస్తాం.! అని ప్ర‌మాణం కూడా చేస్తారు. కానీ..  ఆత‌ర్వాత ఏమ‌వుతుందో ఏమో.. అనూహ్యంగా యూట‌ర్న్ తీసేసుకుంటారు.  జ‌నాల్ని మ‌ళ్లీ ఐదేళ్ల దాకా క‌లిసే ప్ర‌య‌త్నమూ చేయ‌రు. వాళ్ల క‌ష్టాల‌ను తీర్చే ప్ర‌య‌త్న‌మూ చూడ‌రు. అయితే, అంద‌రూ అలాగే ఉంటారా? అంటే..  కాద‌నే చెప్పాలి.. తాజా ప‌రిణామంతో! తెల్ల‌వారి కొన్ని గంట‌ల్లో త‌న కుమారుడి వివాహం […]

టీఆర్ఎస్ లో రాజ‌కీయంగా పెను మార్పు ..ఎంపీ ఔట్‌!

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో?  ఎలా జ‌రుగుతుందో ? ఊహించ‌డం కూడా క‌ష్టం. గంట కింద‌టి వ‌ర‌కు అంటి పెట్టుకున్న నేత‌లు.. మ‌రో గంట‌లో విడిపోయి వేరు కుంప‌ట్లు పెట్టుకున్న ప‌రిస్థితి రాజ‌కీయాల‌ది. కాబ‌ట్టి.. రాజ‌కీయాల‌న్నాక ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు. అలాగ‌ని ఎవ‌రూ శాశ్వ‌త శ‌త్రువులూ ఉండ‌వు.  కాంగ్రెస్‌లో గ‌తంలో అనేక ప‌ద‌వులు అనుభ‌వించి, ఉమ్మ‌డి ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడి చ‌క్రం తిప్పిన  ద‌ళిత నేత ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ అంద‌రికీ సుప‌రిచితుడే.  మ‌రి అంత‌లా […]

నంద్యాల‌లో శిల్పా గెలుపుకు కేసీఆర్,జ‌గ‌న్… అస‌లు ప్లాన్ ఇదే!

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం గ‌డువు ముగిసేందుకు మ‌రో వారం రోజులు కూడా లేదు. గెలుపుపై అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ ధీమాగానే ఉన్నాయి. ఈ ఉప ఎన్నిక‌పై ఒక్క ఏపీలోనే రూ.1000 కోట్ల బెట్టింగ్ జ‌రుగుతోంది. జ‌గ‌న్ 15 రోజుల పాటు అక్క‌డే మ‌కాం వేస్తున్నాడు. ఇక రేపు బాల‌య్య అక్క‌డ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ మ‌రుస‌టి రోజు సీఎం చంద్ర‌బాబు దిగుతున్నాడు. టీడీపీ త‌ర‌పున మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ త‌రపున ఎమ్మెల్యేలు ఓవ‌రాల్‌గా […]

ముద్ర‌గ‌డ ముద్ర చెరిగిపోతుందా?!

అవును! కాపు స‌మాజాన్ని త‌న జాతి అంటూ భుజాల మీద‌కి ఎక్కించుకున్న నేత మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. కాపు జాతి కోసం ఆయ‌న ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌ని నేత‌గా ఇటీవ‌ల కాలంలో భారీగా గుర్తింపు పొందారు. మా కంటూ ఓ నేత ఉన్నాడు అని కాపులు చెప్పుకొనేలా ముద్ర‌గ‌డ ఎదిగిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు కాపు జాతికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తాన‌ని ఇచ్చిన హామీని అమ‌లు చేయాల‌ని ప‌దే ప‌దే డిమాండ్ […]

వైసీపీ లేడీ ఫైర్‌బ్రాండ్స్‌ను టార్గెట్ చేసేవారేరి..?

నేత‌ల ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌తో నంద్యాల ప్ర‌చారం హీటెక్కింది. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, దాడుల‌తో ఇరు పార్టీల నేత‌లు క‌త్తులు నూరుతున్నారు ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై మంత్రులు ప్రెస్‌మీట్లు పెట్టి వాటిని తిప్పికొడు తున్నారు. జ‌గ‌న్‌పై టీడీపీ మంత్రులు, నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై వైసీపీలోని అక్కాచెల్లెళ్లు ఘాటుగా స్పందిస్తూ ఏకి పాడేస్తున్నారు. మాట‌కు మాట బ‌దులిస్తూ.. టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థంగా తిప్పికొడు తున్నారు. వీరి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక మంత్రులు తిక‌మ‌క‌ప‌డిపోతున్నారు. వీళ్ల కంటే.. జ‌గ‌న్‌ను […]

నంద్యాల వేడెక్కింది… బాబు-జ‌గ‌న్‌-బాల‌య్య‌-ప‌వ‌న్‌

నంద్యాల‌లో ఎన్నిక‌లకు తేదీ ద‌గ్గ‌ర‌పుడుత‌న్న కొద్దీ.. ప్ర‌తి ఒక్క‌రిలో ఉత్కంఠ పెరుగుతోంది. ప్ర‌చారానికి ముగింపు ప‌లికేందుకు స‌మ‌యం ద‌గ్గ‌ర‌కొస్తున్న స‌మ‌యంలో.. అగ్ర నేత‌లు ప్ర‌చారంలోకి దిగ‌బోతున్నారు. ఇప్ప‌టికే వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్.. నంద్యాల‌లోనే మ‌కాం వేశారు. ఇక టీడీపీ నుంచి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు అక్క‌డే ఉంటున్నారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా రంగంలోకి దిగ‌బోతున్నారు. ఆయ‌న‌తో పాటు సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఒక‌వైపు.. చివ‌రి రెండు రోజులు ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేన అధినేత […]

టీడీపీతో స్నేహ‌`హ‌స్తం` కుదిరిందా?

తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ దెబ్బ‌కు కాంగ్రెస్‌, టీడీపీ కుదేలైపోయాయ‌. కాంగ్రెస్‌లో అంతోఇంతో చెప్పుకోద‌గ్గ్ నేత‌లు ఉన్నా.. టీడీపీ ప‌రిస్థితి మ‌రీ ఘోరంగా ఉంది. అయితే కాంగ్రెస్‌, టీడీపీ, క‌మ్యూనిస్టులు, ఇలా అన్ని పార్టీలు ఒక తాటిపైకి చేరాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నా.. అది కుద‌ర‌డం లేదు. అంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే.. అదే కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించ‌డం. టీఆర్ఎస్‌ను ఓడించ‌డానికి కాంగ్రెస్‌తోనైనా క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌ని.. టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఇన్నాళ్ల‌కు ఈ […]