కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్‌వర్మ మరోసారి తనదైన స్టైల్లో కాంట్రవర్సీ కామెంట్లతో రెచ్చిపోయాడు. తాజాగా విజయవాడలో వంగవీటి ఫ్యామిలీపై పూనూరు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాపుల్లోను, వంగవీటి అభిమానుల్లోను పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఈ కాంట్రవర్సీ దెబ్బతో జగన్ ఏకంగా గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు పరిస్థితి వెళ్లింది.
ఈ వివాదంలో వంగవీటి రాధా, ఆయన తల్లి రత్నకుమారిని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లడం రత్నకుమారి స్పృహ తప్పిపడిపోవడం ఈ తల్లికొడుకులు ఇద్దరూ పోలీస్‌స్టేషన్‌లో కూర్చోవడం జరిగింది. ఈ ఫొటోలో రాధా చొక్కా గుండీలు ఊడిపోయి ఉన్నాయి. తాజాగా ఈ ఇష్యూలోకి ఎంటర్ అయిపోయిన వర్మ ఈ ఫొటోలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి.. కొన్ని వివాదాస్పద రాతలకు రాంగోపాల్ వర్మ తెరలేపాడు.
తనకు వంగవీటి భార్య, కొడుకు అంటే ఎనలేని ప్రేమ అంటూ వర్మ వెటకారపు పోస్ట్ పెట్టాడు. తన భార్య, కొడుకు స్టేషన్లో ఇలా కూర్చున్నందుకు వంగవీటి స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్ చేస్తాడని… తల్లి ఎందుకు నల్లగా ఉందో, కొడుకు ఎందుకు తెల్లగా ఉన్నాడో లోరియల్ కాస్మొటిక్ కంపెనీ చెప్పాలని వర్మ చేసిన పోస్ట్‌పై పెనుదుమారమే రేగుతోంది.
గౌతంరెడ్డిని దారుణంగా టార్గెట్ చేసిన వంగవీటి అభిమానులు ఇప్పుడు వంగవీటి ఫ్యామిలీని ఇంతలా టార్గెట్ చేసిన వర్మపై ఎలా ఎటాక్ చేస్తారో ? చూడాలి.