సుమ‌కు దూరంగా ఉండ‌టానికి కార‌ణం అదే: రాజీవ్ కనకాల

బుల్లితెరపై మకుటం లేని మహారాణి, స్టార్ యాంక‌ర్ సుమ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచాయ‌లు అవ‌స‌రం లేదు. రోజుకో కొత్త యాంక‌ర్ వ‌చ్చి అందాలు ఆర‌బోస్తున్నా.. సుమ క్రేజ్ ఏ మాత్రం డౌన్ అవ్వ‌డం లేదు. వ‌రుస టీవీ షోలు, సినిమా ఈవెంట్ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతూ.. హీరోయిన్ రేంజ్‌లో సంపాదిస్తుంది. ఇదిలా ఉంటే.. సుమ‌, ఆమె భ‌ర్త రాజీవ్ కన‌కాల విడి విడిగా ఉండ‌టంతో.. వీరిద్ద‌రూ విడిపోయార‌ని, విడాకులు తీసుకున్నార‌ని గ‌తంలో ఎన్నో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి […]

ప్ర‌భాస్‌ మూవీలో కామెడీ కింగ్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌?!

త‌న‌దైన హావభావాలతో, అద్భుత‌మైన డైలాగ్ డెలివ‌రీతో కోట్లాది మంది ప్రేక్షకులను అల‌రించిన కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన బ్ర‌హ్మీ.. స్క్రీన్‌పై క‌నిపిస్తే చాలు ప్రేక్ష‌కుల‌కు పొట్ట చ‌క్క‌ల‌య్యేలా న‌వ్వాల్సిందే. 1987లో అహనా పెళ్ళంటా మూవీలో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన బ్ర‌హ్మీ.. ఇప్పటివరకు ఏ సంవత్సరం కూడా వెండితెర‌పై గ్యాప్ ఇవ్వ‌లేదు..తీసుకోనూలేదు. ఇక ఇటీవ‌ల జాతిర‌త్నాలు సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిని ఈయ‌న‌.. […]

రికార్డు ధ‌ర‌కు అమ్ముడైన `ఆర్ఆర్ఆర్‌` ఆడియో హక్కులు!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా అలియా భట్‌, తారక్‌ సరసన ఒలీవియా మోరీస్ న‌టిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్న […]

థ్రిల్లింగ్‌గా `తిమ్మరుసు` ట్రైల‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో స‌త్య‌దేవ్ తాజా చిత్రం `తిమ్మ‌రుసు`. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ ఒరిజినల్స్ బ్యాన‌ర్ల‌పై మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా న‌టించింది. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 30న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ విడుద‌ల చేశారు. `డిఫెన్స్ లాయర్ […]

`భీమ్లా నాయక్`గా ప‌వ‌న్‌..వైర‌ల్‌గా న్యూ పిక్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి క‌లిసి మ‌ల‌యాళ హిట్ అయ్యప్పనుమ్‌ కోషియుమ్ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇవాలే ఈ సినిమా షూటింగ్ రీస్టార్ అయింది. ప‌వ‌న్ క‌ళ్యాన్ మ‌ళ్లీ సెట్స్‌లో అడుగు పెట్టార‌ని తెలిపిన చిత్ర యూనిట్‌.. […]

బెజవాడ ‘దేశం’లో నాలుగు స్తంభాలాట…. !

బెజవాడ.. విజయవాడ.. పేరేదైనా సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువు.. అధికార పార్టీలో కాదు గానీ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నిప్పు..ఉప్పులా ఉంటున్నారు బెజవాడ నాయకులు. గతంలో విజయవాడ దేశం నాయకులు బలంగా ఉండేవారు. అయితే ఇపుడా పరిస్థితి లేదు. అర్బన్ నాయకులు ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ చంద్రబాబుకు తలనొప్పిగామారారు. దీంతో ఎవరికి ఏం చెప్పాలో అధినేతకు అర్థం కాక అలా వదిలేశాడని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాన నలుగురు నాయకులు నాలుగు దిక్కులుగా […]

లోకేష్ లక్ష్యం.. అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే..

నారా లోకేష్.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. పార్టీకి భవిష్యత్ నేత ఈయనే అనేది అధినేత. తండ్రి చంద్రబాబు ఆశ..ఇవన్నీ సాధ్యం కావాలంటే లోకేష్ ముందుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలి.. అధ్యక్షా.. అని మాట్లాడాలి.. అదే ఇపుడు ముందున్న లక్ష్యం.. 2019 ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకే అనుకున్న తండ్రీకొడుకులకు మంగళగిరి వాసులు షాక్ ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకష్ణారెడ్డి చేతిలో ఓలమి పాలయ్యారు. సాక్షాత్తూ.. ముఖ్యమంత్రి కుమారుడే (చంద్రబాబు అప్పుడు సీఎం) ఓటమి […]

సమయం ఆసన్నమైంది మిత్రమా.. మంత్రి వర్గంలో చోటు దక్కించుకుందామా.. !

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి వర్గవర్గ విస్తరణ సమయంలో పలువురికి చోటు కల్పించారు. రెండున్నర సంవత్సరాల తరువాత కేబినెట్ మినిస్టర్స్ చేసిన పనిని బేరీజు వేసుకొని మార్పులు చేస్తానని అప్పుడే చెప్పాడు. ఇప్పుడు సమయం దగ్గరకు వచ్చింది. మరి టీమ్ లో ఎవరుంటారో.. ఎవరు బయటకు వెళతారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే జగన్ మదిలో ఉన్నది ఎవరికీ చెప్పడు అని సీఎంకు సన్నిహితంగా ఉన్నవారే చెబుతారు. దీంతో బెర్త్ […]

వామ్మో.. ఇప్పుడు రాజీనామా చేయాలా.. ఇదేంది బాసూ.. !

విశాఖ ఉక్కు కోసం రాజీనామాలు చేస్తాం.. మరి మీరు అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు  ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి లేఖ రాయడం పార్టీలో కాకపుట్టిస్తోంది. ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండగానే రాజీనామా ఏంటి అని ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. మేము చేయగలం.. మరి మీరు అని సీఎం జగన్ ను, ఆయన పార్టీని చంద్రబాబు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కుకు టీడీపీ సంపూర్ణ మద్దతు […]