రికార్డు ధ‌ర‌కు అమ్ముడైన `ఆర్ఆర్ఆర్‌` ఆడియో హక్కులు!?

July 27, 2021 at 7:50 am

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా అలియా భట్‌, తారక్‌ సరసన ఒలీవియా మోరీస్ న‌టిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోపై కూడా ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆర్ఆర్ఆర్ ఆడియో హ‌క్కులు రికార్డు ధ‌ర‌కు కొనుగోలు చేశార‌ట‌.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మ‌రియు హిందీ భాషల్లోని ఆర్ఆర్ఆర్ ఆడియో రైట్స్ ను లహరి మ్యూజిక్‌, టీ సిరీస్‌ సంయుక్తంగా రూ.25 కోట్లకు ద‌క్కించుకున్నార‌ట‌. దాంతో ఆడియో హక్కులకు ఇంత మొత్తంలో ధర పలికిన ఏకైక సినిమాగా దేశంలోనే ఆర్‌ఆర్‌ఆర్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కాగా, గతంలో కేజీయఫ్‌2 ఆడియో హక్కులను లహరి మ్యూజిక్‌ సంస్థ సుమారు రూ.7.2కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

రికార్డు ధ‌ర‌కు అమ్ముడైన `ఆర్ఆర్ఆర్‌` ఆడియో హక్కులు!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts