ప్ర‌భాస్‌ మూవీలో కామెడీ కింగ్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌?!

త‌న‌దైన హావభావాలతో, అద్భుత‌మైన డైలాగ్ డెలివ‌రీతో కోట్లాది మంది ప్రేక్షకులను అల‌రించిన కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన బ్ర‌హ్మీ.. స్క్రీన్‌పై క‌నిపిస్తే చాలు ప్రేక్ష‌కుల‌కు పొట్ట చ‌క్క‌ల‌య్యేలా న‌వ్వాల్సిందే.

Comedy track on Prabhas and Brahmanandam in Project K - tollywood

1987లో అహనా పెళ్ళంటా మూవీలో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన బ్ర‌హ్మీ.. ఇప్పటివరకు ఏ సంవత్సరం కూడా వెండితెర‌పై గ్యాప్ ఇవ్వ‌లేదు..తీసుకోనూలేదు. ఇక ఇటీవ‌ల జాతిర‌త్నాలు సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిని ఈయ‌న‌.. ప్ర‌భాస్ పాన్ ఇండియా చిత్రంలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేశారు. ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

Comedy king Brahmanandam and SS Rajamouli made Prabhas Almost Cried

ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇటీవ‌లె ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఈ చిత్రంలో బ్రహ్మానందం కూడా నటిస్తున్నార‌ట‌. పూర్తి హాస్యభరితమైన ఓ పాత్ర కోసం బ్ర‌హ్మీని ఎంపిక చేశార‌ని.. అందుకు ఆయ‌న కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇదే నిజ‌మైతే.. బ్ర‌హ్మానందం తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే అవుతుంది.