పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి మలయాళ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఇవాలే ఈ సినిమా షూటింగ్ రీస్టార్ అయింది. పవన్ కళ్యాన్ మళ్లీ సెట్స్‌లో అడుగు పెట్టారని తెలిపిన చిత్ర యూనిట్.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది. తాజాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నేమ్‌ను తెలిపుతూ ఓ పిక్‌ను షేర్ చేశారు.
ఈ చిత్రంలో పవన్ `భీమ్లా నాయక్` అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. అలాగే ఖాకీ దుస్తులు ధరించి వెనక్కి తిరిగి ఉన్న పవన్ ను తాజాగా విడుదల చేసిన పిక్‌లో చూడచ్చు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పిక్‌ను చూసిన పవన్ అభిమానులు.. ఆనందంతో తెగ మురిసిపోతున్నారు. కాగా, ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.