థ్రిల్లింగ్‌గా `తిమ్మరుసు` ట్రైల‌ర్‌!

July 26, 2021 at 5:52 pm

టాలీవుడ్ యంగ్ హీరో స‌త్య‌దేవ్ తాజా చిత్రం `తిమ్మ‌రుసు`. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ ఒరిజినల్స్ బ్యాన‌ర్ల‌పై మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా న‌టించింది.

ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 30న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ విడుద‌ల చేశారు. `డిఫెన్స్ లాయర్ రామచంద్ర.. తెలివైన వాడే కానీ ప్రాక్టికల్ గాయ్ కాదు..` అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం సూపర్ థ్రిల్లింగ్‌గా కొన‌సాగింది. అలాగే లాయరుగా సత్యదేవ్ న‌ట‌న‌, లుక్స్ అల‌రిస్తున్నాయి.

`నీ ముందు ఉన్నది వాలి అని మర్చిపోకు.. నీ ఎదురుగా ఉండే సగం బలం లాగుతా లాయర్‌ రామచంద్రా` అంటూ విల‌న్ వార్నింగ్ ఇస్తే.. అందుకు `నువ్వు సగం బలం లాక్కునే వాలి అయితే, నేను దండేసి దండించే రాముడిలాంటి వాడిని` అంటూ దీటుగా స‌త్య‌దేవ్‌ పంచ్ ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

థ్రిల్లింగ్‌గా `తిమ్మరుసు` ట్రైల‌ర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts