మెగా అభిమానులకు గుడ్ న్యూస్

టాలీవుడ్‌లో నిన్న‌టి త‌రంలో ఎన్టీఆర్‌-ఏఎన్నార్‌-సూప‌ర్‌స్టార్ కృష్ణ‌-శోభ‌న్‌బాబు-కృష్ణంరాజు త‌ర్వాత మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు లేవు. చాలా రోజుల త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్ లాంటి స్టార్ హీరో ఒక్క‌డు మాత్ర‌మే మ‌హేష్‌బాబు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, రామ్ వంటి హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో న‌టించాడు. వెంక‌టేష్ త‌ర్వాత మ‌రే అగ్ర‌హీరో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయ‌లేదు. అయితే ఇప్పుడు మ‌రో క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్ మూవీకి రంగం సిద్ధ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది. ఆ సినిమాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోనుండ‌డం విశేషం. […]

షాక్‌: మ‌హేష్‌-దిల్ రాజు మూవీ రిలీజ్ డేట్‌

గ‌తేడాది బ్ర‌హ్మోత్స‌వం లాంటి డిజాస్ట‌ర్ మూవీలో న‌టించిన ప్రిన్స్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం సౌత్ ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా (వ‌ర్కింగ్ టైటిల్ ఏజెంట్ శివ‌)లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ డీవీవీ దాన‌య్య నిర్మాత‌గా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే క్రేజీ ప్రాజెక్టులో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. మురుగ‌దాస్ సినిమాతో పాటు, కొర‌టాల శివ సినిమాపై సైతం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల త‌ర్వాత మ‌హేష్ కేరీర్‌లోనే 25వ […]

శ‌త‌మానం 3 రోజుల వ‌సూళ్ల‌తో టాలీవుడ్ షేక్‌

గ‌త సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాల ట‌ఫ్ కాంపిటేష‌న్‌లో ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాతో హిట్ కొట్టిన శ‌ర్వానంద్ ఈ సంక్రాంతికి అగ్ర హీరోలు చిరు-బాల‌య్య ల్యాండ్ మార్క్ మూవీల‌తో పోటీప‌డి శ‌త‌మానం భ‌వ‌తి రూపంలో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు నిర్మించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ శ‌త‌మానం భ‌వ‌తి సంక్రాంతి రోజున థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. రెండు పెద్ద సినిమాలు బ‌రిలో ఉండ‌డంతో శ‌త‌మానం భ‌వ‌తిపై ముందుగా ఎవ్వ‌రికి అంచ‌నాలు […]

ఖైదీ-శాత‌క‌ర్ణి-శ‌త‌మానం వ‌సూళ్ల లెక్క‌లివే

ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సీజన్‌కు టాలీవుడ్ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతోంది. మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి, ఈ మూడు సినిమాల‌తో పాటు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి హెడ్‌కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య ఈ నాలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వీటిలో ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి సినిమాకు మిన‌హా మిగిలిన మూడు సినిమాల‌కు ఓ రేంజ్‌లో క‌లెక్ష‌న్లు కురుస్తున్నాయి. తెలుగు సినిమా మార్కెట్‌కు కీల‌కంగా మారిన ఓవ‌ర్సీస్‌లో ఈ […]

ఆంధ్రాలో నారాయ‌ణ‌మూర్తి సినిమాకు తొక్కేశారా..!

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. గ‌తేడాది కూడా నాలుగు సినిమాలు వ‌చ్చినా నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. గ‌తేడాది నాన్న‌కు ప్రేమ‌తో – డిక్టేట‌ర్ – ఎక్స్‌ప్రెస్ రాజా – సోగ్గాడే చిన్ని నాయినా ఈ నాలుగు సినిమాలు వ‌చ్చి హిట్ కొట్టాయి. ఈ యేడాది కూడా సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. వీటిలో మెగాస్టార్ ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌కృష్ణ శాత‌క‌ర్ణి సినిమాల‌తో పాటు శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి కూడా […]

ఖైదీ నెంబర్ 150 ఖాతాలో మరో రికార్డు

మెగాస్టార్ చిరంజీవి దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నెంబ‌ర్ 150. కోలీవుడ్‌లో హిట్ అయిన విజ‌య్‌-మురుగ‌దాస్ క‌త్తి సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ నెల 11న రిలీజ్ అయ్యింది. భారీ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే ఖైదీ రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో కూడా అంచ‌నాల‌కు మించి వ‌సూళ్లు సాధిస్తోంది. తొలి రోజు 4700 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన ఖైదీ అమెరికాలో […]

స్టార్ హీరోతో క్రిష్ హిస్టారికల్ మూవీ

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా రిలీజ్ అయ్యిందో లేదో క్రిష్ పేరు సౌత్ ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్‌లో మార్మోగిపోతోంది. రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కులు సైతం క్రిష్ నుంచి తాము నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ క్రిష్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. శాత‌క‌ర్ణి లాంటి సినిమాను కేవ‌లం రూ.50 కోట్ల బ‌డ్జెట్‌లో 79 రోజుల్లో తెర‌కెక్కించాడంటే అంద‌రూ స్ట‌న్ అయిపోతున్నారు. అంత త‌క్కువ బ‌డ్జెట్‌, అన్ని త‌క్కువ రోజులు తీసుకున్నా శాత‌క‌ర్ణి క‌థ‌నాన్ని న‌డిపే విష‌యంలో ఎక్క‌డా త‌డ‌బాటు లేకుండా, క్వాలిటీతో సినిమా […]

రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్టుపై క్లారిటీ

ఐదు సంవ‌త్స‌రాల పాటు ఆ డైరెక్ట‌ర్ మ‌దిలో ఒకే ఒక ఆలోచ‌న‌… రెండో ఆలోచ‌న లేదు. ఆయ‌న నిద్ర‌పోయినా, మేల్కొన్నా బాహుబ‌లి గురించే ఆలోచ‌నంతా..అంత క‌ష్టానికి ఫ‌లితం బాహుబ‌లి రూపంలో అదిరిపోయే విజ‌యం ద‌క్కింది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప‌డిన క‌ష్టానికి బాహుబ‌లి సినిమా తెలుగు సినీ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. బాహుబ‌లి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాకు కంటిన్యూగా తెర‌కెక్కిన బాహుబ‌లి – ది క‌న్‌క్లూజ‌న్ మూవీ ఏప్రిల్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు […]