శ‌త‌మానం 3 రోజుల వ‌సూళ్ల‌తో టాలీవుడ్ షేక్‌

గ‌త సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాల ట‌ఫ్ కాంపిటేష‌న్‌లో ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాతో హిట్ కొట్టిన శ‌ర్వానంద్ ఈ సంక్రాంతికి అగ్ర హీరోలు చిరు-బాల‌య్య ల్యాండ్ మార్క్ మూవీల‌తో పోటీప‌డి శ‌త‌మానం భ‌వ‌తి రూపంలో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు నిర్మించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ శ‌త‌మానం భ‌వ‌తి సంక్రాంతి రోజున థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. రెండు పెద్ద సినిమాలు బ‌రిలో ఉండ‌డంతో శ‌త‌మానం భ‌వ‌తిపై ముందుగా ఎవ్వ‌రికి అంచ‌నాలు లేవు. చిరు-బాల‌య్య మ‌ధ్య ట‌ఫ్ పోటీలో కూడా శ‌త‌మానం భ‌వ‌తి ఇండ‌స్ట్రీకి, ట్రేడ్ వ‌ర్గాల‌కు షాక్ ఇచ్చే రీతిలో వ‌సూళ్లు రాబ‌డుతోంది.

తొలి మూడు రోజుల‌కు శ‌త‌మానం భ‌వ‌తి ఏపీ, తెలంగాణ‌లో రూ 8.23 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక ఓవ‌ర్సీస్‌లో ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌రికి రూ 2.80 కోట్లు కొల్ల‌గొట్టి స్టడీగా దూసుకెళుతోంది. ఇక ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.10 కోట్ల షేర్ రాబ‌ట్టిన శ‌త‌మానం లాంగ్ ర‌న్లో స్ట‌డీగా భారీ వ‌సూళ్లు సాధించి సూప‌ర్ హిట్ కొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

నైజం – 2.80 కోట్లు

సీడెడ్ – 0.99 కోట్లు

ఉత్తరాంధ్ర – 1.34 కోట్లు

ఈస్ట్ – 1.04 కోట్లు

వెస్ట్ – 0.73 కోట్లు

కృష్ణ – 0.49 కోట్లు

గుంటూరు – 0.63 కోట్లు

నెల్లూరు – 0.21 కోట్లు

————————————————————————–

ఏపీ+తెలంగాణ టోట‌ల్ 3 రోజుల షేర్ మొత్తం = 8.23 కోట్లు

—————————————————————————