జ‌గ‌న్‌కు ‘ క‌మ్మ ‘ టి ప్రేమ స‌డెన్‌గా పుట్టుకొచ్చిందే… !

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌డెన్‌గా ‘ క‌మ్మ‌ ‘ టి ప్రేమ పుట్టుకు వ‌చ్చేసింది. క‌మ్మ సామాజిక వ‌ర్గం విష‌యంలో జ‌గ‌న్ ముందు నుంచి విముఖ‌త‌తోనే ఉంటున్నారు. వైఎస్సార్‌సీపీలో అస‌లు క‌మ్మ క‌మ్యూనిటీకీ ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. వైఎస్సార్‌సీపీ కేబినెట్లో ఒకే ఒక క‌మ్మ మంత్రిగా ఉన్న కొడాలి నానిని రెండున్న‌రేళ్ల‌కు మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించేశారు. క‌మ్మ వ‌ర్గానికే చెందిన చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను మంత్రిని చేస్తాన‌ని బ‌హిరంగంగా హామీ ఇచ్చి కూడా మాట త‌ప్పారు. మొన్న ఎన్నిక‌ల్లో ఒక్క విజ‌య‌వాడ ఎంపీ సీటు మాత్ర‌మే క‌మ్మ‌ల‌కు ఇచ్చారు. అలాంటి జ‌గ‌న్‌కు ఇప్పుడు క‌మ్మ వ‌ర్గంపై స‌డెన్‌గా ప్రేమ ఎందుకు పుట్టుకు వ‌చ్చేసింది ? క‌మ్మ‌ల‌కు ఇస్తోన్న ట్విస్టులు ఏంటో ? పూర్తి విశ్లేష‌ణ కోసం ఈ వీడియో క్లిక్ చేసి వినండి.