సినిమాలు లేకున్నా పాపులర్ లిస్టులో సమంతనే టాప్.. ఎలా గురూ..!

సౌత్ స్టార్ హీరోయిన్గా తెలుగులో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా గ‌డుతున్న సంగతి తెలిసిందే. ఇక సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాల్లో నటించకున్నా.. ఆమె నుంచి ఏ చిన్న‌ అప్డేట్ రాకపోయినా ఆడియన్స్ లో మాత్రం అమ్మడిపై క్రేజ్ కాస్త‌ కూడా తగ్గలేదు. శుభం రిలీజ్ తర్వాత సమంత అసలు ఏం చేస్తుందన్న అప్డేట్ ఎవ్వరికి తెలియదు. ఓ బాలీవుడ్ సిరీస్ షూటింగ్ స్టేజ్‌లో ఉన్నా.. దాన్ని వివరాలు ఏవి బయటకు రాలేదు. అయినా.. పాపులారిటీ విషయంలో మాత్రం అసలు తగ్గేదేలే అంటూ నెంబర్ 1 పొజిషన్‌లో దూసుకుపోతుంది సమంత. దీంతో సమంత క్రేజ్ కు రీజ‌న్ ఏంటి.. క్రాక్ చేసే పనిలో బిజీ అయిపోయారు అభిమానులు.

శుభం టైంలో మీడియా ముందుకు వచ్చిన సమంత మళ్ళీ సైలెంట్ అయిపోయింది. అయితే.. ఎలాంటి అప్డేట్స్ అమ్మాడి నుంచి రాకుండా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన ట్రెండీ లుక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌ సర్వేలో మోస్ట్ పాపులర్ లిస్టులో నెంబర్ వన్ పొజిషన్‌లో సమంత దూసుకుపోతుంది. బాలీవుడ్ హ్యాపెండ్‌ బ్యూటీస్ అలియాభ‌ట్‌, దీపిక ప‌దుకొనే లను సైతం వెనక్కి నెట్టి.. నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతుంది సమంత. నేషనల్ ర‌ష్మిక మందన, నయనతార లాంటి ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు.

అయితే వీళ్ళందరి కంటే టాప్‌లో సమంత ఉండడం విశేషం. సమంతకు ఈ రేంజ్‌ పాపులారిటీ రావడానికి అమ్మడి సినిమాల లైన‌ప్‌ కంటే.. పర్సనల్ లైఫ్ ప్రధాన కారణం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజులుగా అమ్మడు ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా.. ప్రతిదీ ట్రేండింగ్‌గా మారుతుంది. తాజాగా సమంత డైరెక్టర్‌తో కలిసి చట్టపట్టలేసుకొని తిరుగుతున్న ఫొటోస్ తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమంత పాపులర్ లిస్ట్ లో టాప్ పొజిషన్‌లో ఉండడానికి కూడా ఒక కారణమట.